టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీసేన

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీసేన
x
Highlights

ప్రపంచకప్‌లో మరో ఆసక్తికర సమరం ఆరంభమైంది. అఫ్గనిస్థాన్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆడిన నాలుగు...

ప్రపంచకప్‌లో మరో ఆసక్తికర సమరం ఆరంభమైంది. అఫ్గనిస్థాన్‌తో మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఆడిన నాలుగు మ్యాచుల్లో టీమిండియా మూడింట్లో గెలిచింది. ఒక మ్యాచ్‌ రద్దయింది. ఇక అఫ్గాన్‌ జట్టు మెగా టోర్నీలో ఇంతవరకు బోణీ కొట్టలేదు. దీంతో టీమిండియాతో జరిగే మ్యాచ్‌తోనైనా ఖాతా తెరవాలని భావిస్తోంది.

టీమిండియా: లోకేశ్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, విజయ్ శంకర్, ఎంస్ ధోనీ, హార్దిక్ పాండ్యా, కేదార్ జాదవ్, కులదీప్ యాదవ్, మహమ్మద్ షమి, యజువేంద్ర ఛాహల్, జస్ప్రీత్ బుమ్రా

ఆఫ్ఘాన్ టీం: హజరుతుల్లా జజాయి, గుల్బాద్దీన్ నాయిబ్, రహ్మత్ షా, హస్మతుల్లా షాహిది, అస్ఘర్ అప్ఘాన్, మహమ్మద్ నబీ, ఇక్రామ్ అలీ ఖిల్, నజిబుల్లా జర్దాన్, రషీద్ ఖాన్, అఫ్తాబ్ ఆలం, ముజీబ్ ఉర్ రహ్మన్

Show Full Article
Print Article
More On
Next Story
More Stories