ఇండోర్ టెస్టు : భారత్ ఆధిక్యం 343

mayank agarwal Double century
x
mayank agarwal Double century
Highlights

రెండవ రోజు ఆటలో మయాంక్ అగర్వాల్ ఆట హైలెట్ అని చెప్పాలి.. ఓవర్ నైట్ స్కోర్ తో బరిలో దిగిన భారత జట్టు మొదటి సెషన్ లో చతేశ్వర్ పుజారా (54: 72 బంతుల్లో 9x4) కలిసి ఆచితూచి ఆడాడు మయాంక్ .

ఇండోర్ టెస్టు : ఇండోర్ వేదికగా ఇండియా ,బంగ్లాదేశ్ జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ రెండవ రోజు ఆటలో భారత్ పూర్తి స్థాయి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 86/1 ఓవర్‌నైట్ స్కోరుతో బరిలోకి దిగిన భారత్ కి మయాంక్ అగర్వాల్(243: 330 బంతుల్లో 28x4, 8x6) అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. సెంచరీ చేసి ఆ తర్వాత డబల్ సెంచరీ కొట్టి జట్టుకు భారీ ఆధిక్యాన్ని సంపాదించి పెట్టాడు. దీనితో రెండవ రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు ఆరు వికెట్లను కోల్పోయి 493 పరుగులను సాధించి ఆటను ముగించింది. రవీంద్ర జడేజా (60: 76 బంతుల్లో 6x4, 2x6), ఉమేశ్ యాదవ్ (25 బ్యాటింగ్: 10 బంతుల్లో 1x4, 3x6) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు.

మయాంక్ అగర్వాల్ - రహనే

రెండవ రోజు ఆటలో మయాంక్ అగర్వాల్ ఆట హైలెట్ అని చెప్పాలి.. ఓవర్ నైట్ స్కోర్ తో బరిలో దిగిన భారత జట్టు మొదటి సెషన్ లో చతేశ్వర్ పుజారా (54: 72 బంతుల్లో 9x4) కలిసి ఆచితూచి ఆడాడు మయాంక్ . ఆ తర్వాత రెండవ సెషన్ లో బంగ్లా బౌలర్లకి చుక్కులు చూపిస్తూ పరుగులు సాధించాడు. ఇక చతేశ్వర్ పుజారా అవుట్ అయ్యాక ఆ వెంటనే కెప్టెన్ కోహ్లి డకౌటైయ్యాడు.

ఆ తర్వాత వచ్చిన అజింక్య రహానె (86: 172 బంతుల్లో 9x4)తో కలిసి భాధ్యతయుతమైన ఇన్నింగ్స్ ని ఆడాడు అగర్వాల్.. ఇద్దరు కలిసి నాలుగో వికెట్‌కి 90 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇదే సమయంలో మయాంక్ తన రెండో డబల్ సెంచరీని కంప్లీట్ చేసుకున్నాడు. ఇక ఆ తర్వాత స్కోర్ బోర్డును పరుగులు పెట్టించిన మయాంక్ జట్టు స్కోరు 432 వద్ద మెహదీ హసన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. రేపటి మ్యాచ్ లో మొదటి సెషన్ లో భారత్ తన స్కోర్ ని డిక్లేర్ చేసే అవకాశం ఉంది.

Keywords : India,Bangladesh,Cricket,Indoor,Test match,Ind vs Ban 1st test match

Show Full Article
Print Article
More On
Next Story
More Stories