భారత్ - బంగ్లాదేశ్ డే/నైట్‌ టెస్ట్ మ్యాచ్... టికెట్ ధర 50 రూపాయలే

భారత్ - బంగ్లాదేశ్ డే/నైట్‌ టెస్ట్ మ్యాచ్... టికెట్ ధర 50 రూపాయలే
x
Highlights

తొలిసారి చరిత్రలో టీం ఇండియా జట్టు డే/నైట్‌ టెస్ట్ మ్యాచ్ ను ఆడనుంది. ఈడెన్ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌తో డే/నైట్ టెస్ట్ ఆడే ప్రతిపాదనను బీసీసీఐ...

తొలిసారి చరిత్రలో టీం ఇండియా జట్టు డే/నైట్‌ టెస్ట్ మ్యాచ్ ను ఆడనుంది. ఈడెన్ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌తో డే/నైట్ టెస్ట్ ఆడే ప్రతిపాదనను బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ జట్టు ముందుంచారు. దీనికి భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లి కూడా ఒకే అనేశాడు. నవంబర్ 22 న బంగ్లా - ఇండియా తొలి డే/నైట్‌ టెస్టు మ్యాచ్‌ మొదలు కానుంది. అయితే ఈ మ్యాచ్ కి అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యేలా బెంగాల్ క్రికెట్ అసోసియేషన్‌ కసరత్తులు చేస్తుంది. అందులో భాగంగానే ఈ మ్యాచ్ కి టికెట్ ధర యాబై రూపాయలుగా నిర్ణయించే అవకాశం ఉన్నట్లు బీసీఏ కార్యదర్శి అభిషేక్‌ దాల్మియా తెలిపారు. ఇప్పటికే టికెట్ ధరలకు గాను ప్రింట్ ప్రక్రియ కూడా మొదలు పెట్టినట్లు తెలిపారు. ముందుగా టికెట్ ధరలను తక్కువగా పెట్టి అభిమానులను భారీ సంఖ్యలో స్టేడియంకి రప్పించవచ్చునని అయన తెలిపారు. ఇప్పటికే బంగ్లాదేశ్ తో టెస్ట్ అండ్ టీ20 మ్యాచ్ లకి గాను భారత జట్టును ఎంపీక చేసిన సంగతి తెలిసిందే..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories