ఇస్మార్ట్ ఇషాంత్‌.. భారత్‌ 75 పరుగుల ఆధిక్యం

ఇస్మార్ట్ ఇషాంత్‌.. భారత్‌ 75 పరుగుల ఆధిక్యం
x
Highlights

వెస్టిండీస్‌ గడ్డపై ఆంటిగ్వా వేదికగా జరుగుతున్న తొలి టెస్టుపై భారత్ పట్టుబిగిస్తున్నది. మ్యాచ్‌లో ముఖ్యంగా ఇషాంత్ శర్మ... పేస్ బౌలింగ్‌తో బలమైన ఛేజింగ్ ఇచ్చాడు. ఇషాంత్ ఒక్కడే ఐదు వికెట్లు పడగొట్టి కీలక భూమిక పోషించాడు.

వెస్టిండీస్‌ గడ్డపై ఆంటిగ్వా వేదికగా జరుగుతున్న తొలి టెస్టుపై భారత్ పట్టుబిగిస్తున్నది. మ్యాచ్‌లో ముఖ్యంగా ఇషాంత్ శర్మ... పేస్ బౌలింగ్‌తో బలమైన ఛేజింగ్ ఇచ్చాడు. ఇషాంత్ ఒక్కడే ఐదు వికెట్లు పడగొట్టి కీలక భూమిక పోషించాడు. ఫలితంగా దీంతో విండీస్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 222 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌కు 75 పరుగుల ఆధిక్యం లభించింది. రోస్టన్‌ చేజ్‌ (74 బంతుల్లో 48; 5 ఫోర్లు, సిక్స్‌), హోల్డర్‌ (65 బంతుల్లో 39; 5 ఫోర్లు), హెట్‌మైర్‌ (47 బంతుల్లో 35; 3 ఫోర్లు).

75 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన భారత్‌ టీ విరామ సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 98 పరుగులు చేసింది. ఓపెనర్లు మయాంక్‌ అగర్వాల్‌ (16), కేఎల్‌ రాహుల్‌ (85 బంతుల్లో 38; 4 ఫోర్లు), వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ చతేశ్వర్‌ పుజారా (25) ఔటయ్యారు. కోహ్లి (14 బ్యాటింగ్‌), రహానే (5 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. నేడు రెండు సెషన్స్‌తో పాటు రెండు రోజులు మిగిలి ఉన్న నేపథ్యంలో.. భారీ స్కోరుతో కరీబియన్లకి టీమిండియా గట్టి సవాల్ విసిరే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories