ఇప్పుడు గానీ ఆమె ఇక్కడ ఉండి ఉంటేనా..

ఇప్పుడు గానీ ఆమె ఇక్కడ ఉండి ఉంటేనా..
x
Highlights

ఎప్పుడైనా గెలుపు కి విశ్లేషణలతో పని ఉండదు. ఇలా అయితే, అలా జరిగితే లాంటి లాజిక్ ల గురించి ఆలోచనలుండవు. ఓటమికి మాత్రం విశ్లేషణలు తప్పనిసరి. అందులోనూ...

ఎప్పుడైనా గెలుపు కి విశ్లేషణలతో పని ఉండదు. ఇలా అయితే, అలా జరిగితే లాంటి లాజిక్ ల గురించి ఆలోచనలుండవు. ఓటమికి మాత్రం విశ్లేషణలు తప్పనిసరి. అందులోనూ క్రికెట్ లాంటి ఆటల్లో.. ఇక విశ్లేషణలతో పాటుగా లాజిక్ లేని మాటలూ వినపడతాయి.. అప్పుడు ఒక్కసారి ఇలా చేసుంటే.. అసలు ఆ బంతి ఆడకుండా వదిలేసుంటే.. ఇలా రకరకాలుగా. కొన్ని వింతగానూ ప్రచారం లోకి వస్తాయి. అలాంటిదే ఇది కూడా..

అది ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్.. మ్యాచ్ టెన్షన్ గా సాగుతోంది. టీవీలు చూస్తున్న వారికీ.. గ్రౌండ్ లో ఉన్నవాళ్ళకీ.. కెమెరాలు ఓ దృశ్యాన్ని పడే పడే చూపించాయి. ఒక మహిళ మ్యాచ్ చూస్తూ మంత్రాలు పతిస్తోన్న దృశ్యమది. ఆమె ఎవరో కాదు నీతా అంబానీ. ముంబాయి గెలవాలని ఆమె ప్రార్థిస్తున్నారు. అప్పుడు ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ముంబై ఇండియన్స్ కష్టాల్లో ఉంది. కానీ, విజయం సాధించింది. కప్ గెలిచింది.

కట్ చేస్తే.. వరల్డ్ కప్ సెమీస్.. పోరు ఉత్కంఠభరితంగా మారింది. ధోనీ, జడేజా మేజిక్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. చేసేశారు కూడా.. కొద్దిగా అదృష్టం పక్కకి జరిగింది. అయితే ఈ సమయంలో ట్విటర్‌లో అప్పటి ఐపీల్ మ్యాచ్ వీడియోతో పాటు మే నెలలో జరిగే వరల్డ్ కప్ టోర్నీలో భారత్ జట్టు వెంట మీరుండాలి అంటూ నీతా అంబానీని కోరుతూ ఢిల్లీకి చెందిన ఆర్కిటెక్‌ శిల్పి తివారీ పోస్ట్ చేసిన ట్వీట్ ను అభిమానులు విపరీతంగా షేర్ చేశారు. దాంతో అది ట్రెండింగ్ గా మారింది. టీమిండియా బ్యాటింగ్‌ చూసిన అభిమానులు.. 'నీతా మంత్రాలు మాత్రమే భారత జట్టును కాపాడగలవు' అంటూ కామెంట్లు పెట్టారు. 'మేడమ్‌ మీ పూజలు చాలా పవర్‌ఫుల్‌.. టీమిండియా కోసం ప్రార్థించరా ప్రీజ్‌' అంటూ నీతాను వేడుకున్నారు. 'నీతా అంబానీ ఎక్కడ ఉన్నారు. ఆమె అవసరం చాలా ఉంది. నన్ను నమ్మండి. ఆమె ప్రార్థనలు చాలా బాగా పనిచేస్తాయ'ని పేర్కొన్నారు. ఆమె కనుక అక్కడ ఉంది ఉంటె భారత్ తప్పక గెలిచేదంటూ వరుస గా ట్వీట్లు వెల్లువెత్తాయి. దీంతో నీతా అంబానీ మరోసారి వార్తల్లో నిలిచారు. ఇక్కడ



Show Full Article
Print Article
More On
Next Story
More Stories