ఫైనల్లో బౌండరీల లెక్కా సమానమైతే ఏం చేసేవారో?

ఫైనల్లో బౌండరీల లెక్కా సమానమైతే ఏం చేసేవారో?
x
Highlights

న్యూజిలాండ్ అదృష్టాన్ని బౌండరీలు లాగేసుకున్నాయి. ఎన్ని పరుగులు చేశామన్నది కాకుండా ఎన్ని బౌండరీలు చేసామనేదీ ఒక్కోసారి క్రికెట్ లో విజయాన్ని...

న్యూజిలాండ్ అదృష్టాన్ని బౌండరీలు లాగేసుకున్నాయి. ఎన్ని పరుగులు చేశామన్నది కాకుండా ఎన్ని బౌండరీలు చేసామనేదీ ఒక్కోసారి క్రికెట్ లో విజయాన్ని శాసిస్తుందని వరల్డ్ కప్ ఫైనల్ రుజువు చేసింది. సమవుజ్జీలుగా నిలిచిన రెండు జట్లలో ఎదో ఒక్క జట్టునే విజేతగా నిర్ణయించాలని కోరుకుంటే.. కొన్ని నిబంధనలు తప్పవు. ఐసీసీ నిబంధనలు అటువంటివే. అయితే, వాటిలో హేతుకతను ఇప్పుడు చాలా మంది ప్రశ్నిస్తున్నారు. కానీ, రూల్ అంటే రూలే కదా. అందుకే ఇంగ్లాండ్ విశ్వవిజేతగా నిలిచింది. న్యూజిలాండ్ ఓడిపోలేదు. రెండో స్థానంలో ఆగిపోయిందంతే. సరే.. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. మ్యాచ్ టై అయితే, సూపర్ ఓవర్ ఉంది. సూపర్ ఓవర్ కూడా టై అయితే.. బౌండరీలు (మ్యాచ్ మొత్తం లో చేసిన బౌండరీలు, సూపర్ ఓవర్ లో చేసిన బౌండరీలు కలిపి) లేక్కేస్తారు. ఏ జట్టు బౌండరీలు ఎక్కువ బాదితే.. ఆ జట్టు విజేతగా నిర్ణయిస్తారు. ఫైనల్స్ లో ఇంగ్లాండ్‌ ప్రధాన ఇన్నింగ్స్‌ బౌండరీలు 24 + సూపర్‌ ఓవర్‌ బౌండరీలు 2 మొత్తం కలిపి 26 బౌండరీలు సాధించగా న్యూజిలాండ్ ప్రధాన ఇన్నింగ్స్‌ బౌండరీలు 16+ సూపర్‌ ఓవర్‌ బౌండరీలు 1 మొత్తం కలిపి 17 బౌండరీలు మాత్రమే సాధించడం తో కప్పు చేజారిపోయింది.

ఇలా లెక్క సరిపోయింది కాబట్టి ఓకే. ఒకవేళ ఈ బౌండరీలు లెక్క కూడా టై అయితే? అప్పుడేం చేస్తారు? అప్పుడు సూపర్‌ ఓవర్‌లో బాదిన బౌండరీలను మినహాయించి ప్రధాన ఇన్నింగ్స్‌లో ఏ జట్టైతే బౌండరీలతో ఎక్కువ పరుగులు సాధిస్తుందో ఆ జట్టుని విజేతగా తేలుస్తారు. అదన్న మాట సంగతి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories