ముంబై మ్యాచ్ ఎఫెక్ట్ : టాప్-10లోకి కోహ్లీ

ముంబై మ్యాచ్ ఎఫెక్ట్ : టాప్-10లోకి కోహ్లీ
x
virat kohli( file photo)
Highlights

గురువారం ఐసీసీ టీ20 ర్యాకింగ్స్ ని ప్రకటించింది. ఇందులో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ టాప్-10లో చోటు

గురువారం ఐసీసీ టీ20 ర్యాకింగ్స్ ని ప్రకటించింది. ఇందులో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ టాప్-10లో చోటు సంపాదించుకున్నాడు. వెస్టిండీస్ తో జరిగిన టీ20 సిరీస్ లో భాగంగా కోహ్లి కేవలం 29 బంతుల్లో 70 పరుగుల చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 4 ఫోర్లు, 7 సిక్సులు ఉన్నాయి. ఈ మ్యాచ్ లో మేరపు లాంటి ఇన్నింగ్స్ ఆడినా కోహ్లి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

అయితే ఈ ఇన్నింగ్స్ లో కోహ్లి అట తీరు ఫలితంగా గురువారం ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో ఐదు స్థానాలు ఎగబాకి టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. మొత్తం మూడు మ్యాచ్ లలో భాగంగా కోహ్లి హైదరాబాద్ టీ20లో 94 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు కోహ్లీ.. అ తర్వాత తిరువనంతపురం రెండో టీ20లో 19 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. ఇక ఆఖరి టీ20లో కోహ్లీ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 29 బంతుల్లో 70 పరుగులు చేశాడు. దీంతో వెస్టిండిస్‌తో ముగిసిన మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ద సిరిస్ అవార్డు లభించింది.

ఇది ఇలా ఉంటే ఐసీసీ టీ20 ర్యాకింగ్స్ లో భారత ఓపెనర్ బాట్స్ మెన్ కేఎల్ రాహుల్ 3 స్థానాలు ఎగబాకి ఆరో స్థానంలో నిలిచాడు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ ఒక స్థానం కోల్పోయి 9వ స్థానంలో నిలిచాడు. పాకిస్థాన్ నుంచి బాబర్ ఆజామ్ మొదటిస్థానంలో నిలిచాడు.

భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య వన్డే సిరీస్ ఆదివారం నుంచి మొదలు కానుంది. ఎమ్. ఎ. చిదంబరం స్టేడియం ఈ మ్యాచ్ కి వేదిక కానుంది..


Show Full Article
Print Article
More On
Next Story
More Stories