logo

ఐసీసీ సంచలన నిర్ణయం.. ఆ దేశంపై సస్పెన్షన్ వేటు

ఐసీసీ సంచలన నిర్ణయం.. ఆ దేశంపై సస్పెన్షన్ వేటు
Highlights

జింబాబ్వే క్రికెట్‌కు ఐసీసీ ఉహించని భారీ షాకిచ్చింది. జింబాబ్వే జట్టును అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్...

జింబాబ్వే క్రికెట్‌కు ఐసీసీ ఉహించని భారీ షాకిచ్చింది. జింబాబ్వే జట్టును అంతర్జాతీయ క్రికెట్ నుంచి సస్పెండ్ చేసింది. ఐసిసి రాజ్యాంగంలోని ఆర్టికల్ 2.4 సి, డి లను ఉల్లంఘించినందుకు ఆ జట్టుపై వేటువేసింది. అయితే నిబంధనలకు విరుద్ధంగా జింబాబ్వే క్రికెట్ బోర్డుపై అక్కడి ప్రభుత్వ జోక్యాన్ని నిరసిస్తూ ఐసిసి ఈ చర్యలు తీసుకున్నట్టు ఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం జింబాబ్వే జోర్డులోని ఎన్నికైన సభ్యులను ప్రభుత్వ సంస్థ స్పోర్ట్స్ అండ్ రీసెర్చ్ కమిటీ సస్పెండ్ చేయడంతో ఐసిసి చర్యలకు దిగింది. ఇక ఐసీసీ నిర్ణయంతో జింబాబ్వేలో క్రికెట్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. కాగా జింబాబ్వే క్రికెట్ బోర్డుకు నిధులు ఆగిపోతాయి. అంతేకాక, ఇకపై ఐసీసీ నిర్వహించే ఏ టోర్నీలోనూ ఆ జట్టు ఆడేందుకు అవకాశం ఉండదు. క్రికెట్ వ్యవహారాల్లో రాజకీయ జోక్యమే ఈ దుస్థితికి కారణమన్న విమర్శలు ఉన్నాయి. కాగా క్రికెట్ బోర్డులో రాజకీయ జోక్యం లేకుండా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పిన ఐసీసీ.. మూడు నెలల్లో బోర్డు సభ్యలను తిరిగి నియమించాలని గడువు విధించింది.

లైవ్ టీవి

Share it
Top