బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా విజయం

బంగ్లాదేశ్‌పై ఆస్ట్రేలియా విజయం
x
Highlights

డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా వరల్డ్‌ కప్‌లో ఐదో విజయంతో మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. గురువారం ఇక్కడ జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో ఆసీస్‌ 48 పరుగుల...

డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా వరల్డ్‌ కప్‌లో ఐదో విజయంతో మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. గురువారం ఇక్కడ జరిగిన లీగ్‌ మ్యాచ్‌లో ఆసీస్‌ 48 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల కోల్పోయి 381 పరుగులు చేసింది. 382 పరుగుల లక్ష్య చేధనలో బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 333 పరుగులు చేసింది.

ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్ (166), కవాజా (89), ఫించ్ (53), మ్యాక్స్ వెల్ (32), స్టోయినీస్ 17 నాటౌట్, స్మిత్ (1), అలెక్స్ కరే 11 నాటౌట్. బంగ్లాదేశ్ బౌలింగ్: సౌమ్య సర్కార్ 3, రెహమాన్‌కు ఒక వికెట్.

బంగ్లాదేశ్: ఇక్బాల్ (62), సౌమ్య సర్కార్ (10), షకీబ్ అల్ హసన్ (41), రహీమ్ 102 నాటౌట్, దాస్ (20), మహ్మదుల్లా (69), సబ్బీర్ రెహమాన్ డకౌట్, మెహిదీ హసన్ (6), మష్రఫ్ మోర్తాజా (6). ఆస్ట్రేలియా బౌలింగ్: మిచ్చెల్ స్టార్క్, నాథన్ కాల్టర్ నైల్, స్టోయినీస్‌కు తలో రెండేసి వికెట్లు, ఆడమ్ జంపాకు ఒక వికెట్.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories