ప్రపంచకప్‌ ఫైనల్లో ఇంగ్లాండ్‌‌కి లక్కులు మీద లక్కులు ఎలా కలిసొచ్చాయి?

ప్రపంచకప్‌ ఫైనల్లో ఇంగ్లాండ్‌‌కి లక్కులు మీద లక్కులు ఎలా కలిసొచ్చాయి?
x
Highlights

ప్రపంచ్ కప్‌ ఫైనల్లో జీరో హీరో అయ్యింది. లక్కుల మీద లక్కులు.. ‎ఒక దాని వెంట ఒకటిగా వచ్చిన అవకాశాలు ఇంగ్లాండ్‌కు వల్డ్ కప్ సాధించి పెట్టాయి. ఆటగాళ్ల ...

ప్రపంచ్ కప్‌ ఫైనల్లో జీరో హీరో అయ్యింది. లక్కుల మీద లక్కులు.. ‎ఒక దాని వెంట ఒకటిగా వచ్చిన అవకాశాలు ఇంగ్లాండ్‌కు వల్డ్ కప్ సాధించి పెట్టాయి. ఆటగాళ్ల పోరాటపటిమ కంటే ఐసీసీ నిబంధనలే బ్రిటిష్ జట్టును విజయతీరాలకు చేర్చాయి. ఇది ప్రపంచ కప్ ఫైనల్లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్‌‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో హైలెట్ సీన్‌. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 241 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్‌‌కు ఆరంభంలోనే గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి. 28 పరుగులకే అత్యంత కీలకమైన జాసన్ రాయ్‌ వికెట్ కోల్పోయింది. పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఇంగ్లండ్‌ను ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్‌, వికెట్ కీపర్‌‌ బట్లర్‌ ఆదుకున్నారు. ఇంగ్లాండ్‌ విజయానికి 50 ఓవర్‌‌లో 15 పరుగులు కావాల్సిన సమయంలో తీవ్ర స్ధాయిలో ఉత్కంఠ రేగింది.

ఈ ఓవర్‌లో తొలి రెండు బంతుల్లో ఒక్క రన్ కూడా రాకపోవడంతో న్యూజిలాండ్ విజయం సాధిస్తుందని అంతా అనుకున్నారు. అయితే మూడో బంతిని స్టోక్స్ సిక్స్‌కు తరలించాడు. నాలుగో బంతిని సింగిల్‌ కోసం కొట్టిన స్టోక్స్‌ రెండో రన్ తీస్తుండగా ఓవర్ త్రో రూపంలో మరో నాలుగు రన్నులు కలిసి వచ్చాయి. దీంతో రెండు బంతుల్లో మూడు పరుగులు తీస్తే విజయం రెండు తీస్తే టై అంతకన్న తక్కువైతే పరాజయంగా మారింది. ఈ సమయంలో వరుస బాళ్లలో సింగిల్ రన్నులు తీసి ఇంగ్లాండ్ రెండు వికేట్లు కోల్పోయింది. దీంతో మ్యాచ్ టై అయ్యింది.

ఐసీసీ నిబంధనల మేరకు మ్యాచ్ టై అయితే సూపర్ ఓవర్ వేయాలి. ఇందులో ఎవరు విజయం సాధిస్తే వారే వారికే కప్ దక్కుతుంది. దీంతో ఇరు జట్ల మధ్య సూపర్ ఓవర్‌తో న్యూజిలాండ్‌‌ బ్యాటింగ్ చేసింది. బౌల్ట్ బౌలింగ్‌లో ఇంగ్లాండ్ 15 పరుగులు సాధించగా అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ అర్చర్ బౌలింగ్‌లో 15 పరుగులు సాధించడంతో మరో సారి టై అయ్యింది. దీంతో నిబంధనలు అనుసరించి అటు మ్యాచ్‌లోనూ ఇటు సూపర్ ఓవర్‌లోనూ అత్యధిక ఫోర్లు సాధించిన ఇంగ్లాండ్‌ విజయం సాధించినట్టు అంపైర్లు ప్రకటించారు.

ఇంగ్లాండ్‌తో పోల్చుకుంటే న్యూజిలాండ్‌లో ఓ సిక్స్‌ ఎక్కువగా ఉన్నా ప్రయోజనం చేకూరలేదు. దీంతో జీరో జట్టు హీరోగా మారిందంటూ నెటీజన్లు కామెంట్స్ పెడుతున్నారు. ఫీల్డింగ్‌లో న్యూజిలాండ్ ఆటగాళ్లు చేసిన వరుస తప్పిదాలు ఇంగ్లాండ్ ఆటగాళ్లయిన బెన్ స్టోక్స్‌, బట్లర్‌‌ల సమయ స్పూర్తి బ్రిటీష్‌ జట్టు విజయానికి బాటలు వేశాయని స్పోర్ట్స్ ‌ఎనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి క్రికెట్ పుట్టినింటిని తొలి సారి ప్రపంచకప్ చేరడంతో ఆ దేశంలో సంబరాలు అంబరాన్ని తాకాయి .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories