సెరీనా ఆశలు గల్లంతు!వింబుల్డన్ గెలిచిన హలెప్

సెరీనా ఆశలు గల్లంతు!వింబుల్డన్ గెలిచిన హలెప్
x
Highlights

తల్లి అయిన తరువాత గ్రాండ్ స్లాం టైటిల్ గెలవాలని ప్రయత్నిస్తున్న సెరీనా విలియమ్స్ ఆశలు మళ్ళీ గల్లంతయ్యాయి. వింబుల్డన్ లో ఎలాగైనా గెలుపు సాధించాలని...

తల్లి అయిన తరువాత గ్రాండ్ స్లాం టైటిల్ గెలవాలని ప్రయత్నిస్తున్న సెరీనా విలియమ్స్ ఆశలు మళ్ళీ గల్లంతయ్యాయి. వింబుల్డన్ లో ఎలాగైనా గెలుపు సాధించాలని ప్రయత్నించిన సెరీనా ఆశల్ని హలెప్ కూల్చేసి, టైటిల్ పట్టుకుపోయింది. వింబుల్డన్ మహిళా ఫైనల్స్ శనివారం జరిగాయి. హోరాహోరీగా జరుగుతుందనుకున్న మ్యాచ్ కాస్తా ఏకపక్షంగా ముగిసింది. పదకొండో సీడ్ సెరీనా విలియమ్స్, ఎడో సీడ్ హలెప్ ల మధ్య జరిగిన తుదిపోరులో హలెప్ 6-2, 6-2తో వరుస సెట్లలో విజయదుందుభి మోగించింది.

తొలి సెట్‌ రెండో గేమ్‌లో సెరెనా సర్వీసును బ్రేక్‌ చేసి 2-0 ఆధిక్యంలోకి వెళ్లిన హలెప్‌..ఆ తర్వాత నాలుగో గేమ్‌లోనూ బ్రేక్‌ సాధించి 4-0తో నిలిచింది. అదే జోరులో ఆమె 6-2తో సెట్‌ నెగ్గింది. రెండో సెట్లోనూ సెరెనా.. హలెప్‌ ధాటికి ముందు నిలువలేకపోయింది. చాలాసార్లు బంతిని నెట్‌కు కొట్టింది. రెండో సెట్‌ ఐదో గేమ్‌లో సెరెనా సర్వీసును బ్రేక్‌ చేసి 3-2 ఆధిక్యంలోకి వెళ్లిన హలెప్‌.. అదే ఊపులో 6-2తో సెట్‌తో పాటు మ్యాచ్‌ను, టైటిల్‌ను గెలుచుకుంది. 26 అనవసర తప్పిదాలు చేసిన సెరెనా ఓటమి కొనితెచ్చుకుంది. ఈ మ్యాచ్‌లో హలెప్‌ ఒక ఏస్‌తో పాటు 13 విన్నర్లు కొట్టింది. హలెప్‌కు ఇది రెండో గ్రాండ్‌స్లామ్‌ టైటిల్‌. 2018లో ఆమె ఫ్రెంచ్‌ ఓపెన్‌ గెలిచింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories