హార్దిక్‌ పాండ్య అద్భుతమైన క్యాచ్‌ చూశారా?

హార్దిక్‌ పాండ్య అద్భుతమైన క్యాచ్‌ చూశారా?
x
Highlights

బీసీసీఐ సస్పెన్షన్ తో గత కొన్నివారాలుగా క్రికెట్ కు దూరంగా ఉన్న టీమిండియా వివాదాస్పద ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా న్యూజిలాండ్ తో మూడో వన్డేలో ఓ సూపర్...

బీసీసీఐ సస్పెన్షన్ తో గత కొన్నివారాలుగా క్రికెట్ కు దూరంగా ఉన్న టీమిండియా వివాదాస్పద ఆల్ రౌండర్ హార్ధిక్ పాండ్యా న్యూజిలాండ్ తో మూడో వన్డేలో ఓ సూపర్ డూపర్ క్యాచ్ తో మ్యాజిక్ చేశాడు. బే ఓవల్ వేదికగా న్యూజిలాండ్ తో జరిగుతున్న ఈ కీలక సమరంలో పాండ్యా తన ఫీల్డింగ్ ప్రతిభతో మ్యాచ్ ను మలుపు తిప్పాడు. ఆట 16 ఓవర్లో లెగ్ స్పిన్నర్ చాహల్ బౌలింగ్ లో కివీ కెప్టెన్ కేన్ విలియమ్స్ సన్ ఇచ్చిన క్యాచ్ ను హార్థిక్ పాండ్యా సూపర్ మ్యాన్ లా గాల్లో తేలిపోయి మరీ అందుకొన్నాడు. ఇలాంటి అరుదైన క్యాచ్ లను తాను మాత్రమే పట్టగలనని పాండ్యా మరోసారి చాటుకొన్నాడు. బౌలింగ్ లో సైతం పాండ్యా 45 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. న్యూజిలాండ్ ను 243 పరుగుల స్కోరుకు ఆలౌట్ చేయడంలో ప్రధానపాత్ర వహించాడు.


Show Full Article
Print Article
Next Story
More Stories