క్రికెటర్లు పాండ్యా, కే ఎల్ రాహుల్‌ రీఎంట్రీ..

క్రికెటర్లు పాండ్యా, కే ఎల్ రాహుల్‌ రీఎంట్రీ..
x
Highlights

టీమిండియా ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్య, కేఎల్‌ రాహుల్‌కు ఊరట లభించింది. వారిపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. వీరిద్దరిపై...

టీమిండియా ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్య, కేఎల్‌ రాహుల్‌కు ఊరట లభించింది. వారిపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. వీరిద్దరిపై సస్పెన్షన్‌ విధించడం సరైంది కాదంటూ గతవారం బీసీసీఐ అధ్యక్షుడు సీకే ఖన్నా పాలకుల కమిటీకి లేఖ రాశారు. యువ క్రికెటర్లు చేసిన పొరపాటుకు ఇప్పటికే శిక్ష అనుభవిస్తున్నారని.. ఇక వారికి ప్రత్యేకంగా శిక్షేమీ అవసరం లేదంటూ ఆయన సీఓఏకు వివరించారు. పాండ్యా, కే ఎల్ రాహుల్ ఇద్దరు ఈ వ్యాఖ్యలపై క్షమాపణలు కూడా చెప్పారు. దాంతో వీరిపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేస్తూ బీసీసిఐ నిర్ణయం తీసుకుంది.

కాగా ఓ ప్రముఖ టీవీ ఛానల్ నిర్వహించే షోలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి నిషేధం ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. మహిళను ఉద్దేశించి వీరు అసభ్యకరమైన వ్యాఖ్యలు చేయటంతో.. దేశవ్యాప్తంగా మహిళల నుండి తీవ్ర నిరసన వ్యక్తమయింది. బిసిసిఐ వీరిపై నిషేధం విధించింది. దీంతో ఇద్దరూ పర్యటనలో మధ్యలోనే స్వదేశానికి తిరిగి వచ్చేయాల్సి వచ్చింది. అయితే సస్పెన్షన్ ఎత్తివేయడంతో హార్దిక్‌, రాహుల్‌.. న్యూజిలాండ్‌లో ఉన్న భారత క్రికెట్‌ జట్టులో చేరే కనిపిస్తోంది. టీమిండియా-కివీస్‌ జట్ల మధ్య రేపు(జనవరి 26) రెండో వన్డే ప్రారంభం కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories