లవ్‌ విషయాన్ని బయటపెట్టిన హార్ధిక్ పాండ్యా

లవ్‌ విషయాన్ని బయటపెట్టిన హార్ధిక్ పాండ్యా
x
హార్దిక్‌ పాండ్యా
Highlights

టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా గత కొంతకాలంగా సెర్బియా మోడల్‌ నటాషా స్టాన్‌తో రిలేషన్‌పిప్‌లో ఉన్నాడు. వీరిద్దరి మధ్య సంబంధంపై తాజాగా హార్దిక్...

టీమిండియా ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా గత కొంతకాలంగా సెర్బియా మోడల్‌ నటాషా స్టాన్‌తో రిలేషన్‌పిప్‌లో ఉన్నాడు. వీరిద్దరి మధ్య సంబంధంపై తాజాగా హార్దిక్ పాండ్యా స్పందించాడు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని తన ఇన్‌స్ట్రాగ్రామ్‌ ఖాతాలో పాండ్యా ఒక పోస్టు పెట్టాడు. అందులో నటాషాతో తాను దిగిన ఫొటోను షేర్‌ చేస్తూ నా ఫైర్‌వర్క్‌తో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించడం అని కామెంట్ పెట్టాడు. నటాషా గురించి హార్దిక్ పాండ్యా చేసిన మొదటి కామెంట్ ఇది కావడం విశేషం. నిజానికి గత కొంతకాలంగా వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయారని వార్తలు నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి.

తాజాగా ఈ వార్తలు నిజం చేస్తూ పాండ్యా తన ఇనిస్టాగ్రామ్‌లో ఫోటో పెట్టాడు. గతంలో చాలామంది అమ్మాయిలతో హార్దిక్‌ పాండ్యా సంబంధాలను కొనసాగించాడు. అయితే, నటాషాతో తన సంబంధాన్ని పాండ్యా సీరియస్‌గా తీసుకున్నాడని, పెళ్లి వరకు వెళ్లే అవకాశం ఉందని సన్నిహితులు అంటున్నారు. గత ఏడాది మేలో నటాషాను తన ఇంటికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులకు కూడా పాండ్యా పరిచయం చేశాడు. ప్రస్తుతం ముంబైలో నివాసముంటున్న నటాషా తొలుత బాలీవుడ్‌లోకి ఐటమ్‌ గర్ల్‌గా అడుగుపెట్టింది. ఇటీవల షారుక్‌ ఖాన్‌, అనుష్క నటించిన జీరో అనే సినిమాలో ఓ కీలకపాత్రలో నటించింది.


View this post on Instagram

Starting the year with my firework ❣️

A post shared by Hardik Pandya (@hardikpandya93) on


Show Full Article
Print Article
More On
Next Story
More Stories