Top
logo

అతను లేకపోతే నేను క్రికెట్ లోనే లేను : హర్బజన్ సింగ్

అతను లేకపోతే నేను క్రికెట్ లోనే లేను : హర్బజన్ సింగ్
Highlights

భారత మాజీ కెప్టెన్, క్రికెటర్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ లేకపోతే నాకు క్రికెట్ లోనే ఉండేవాడిని కాదని భారత హాఫ్ స్పిన్నర్ హర్బజన్ సింగ్ పేర్కొన్నాడు.

భారత మాజీ కెప్టెన్, క్రికెటర్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ లేకపోతే నాకు క్రికెట్ లోనే ఉండేవాడిని కాదని భారత హాఫ్ స్పిన్నర్ హర్బజన్ సింగ్ పేర్కొన్నాడు.. కెరియర్ తొలినాళ్ళలో నాకు గంగూలీ అండగా నిలిచాడని, ఒకవేళ అతను లేకపోతే నేను నా ఫ్రెండ్స్ లాగే కెనడాలో స్థిరపడిపోయేవాడినని అన్నాడు హర్బజన్ .. తాజాగా దాదాగిరి అనే టీవీ షోలో పాల్గొన్న భజ్జీ 2001లో ఆస్ట్రేలియాతో జరిగిన గవాస్కర్-బోర్డర్ ట్రోఫి మ్యాచ్ తాలూకు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. 2000 సంవత్సరంలో నా కెరీర్ అయిపోయిందని అన్నారు. నేను అప్పుడు చాలా కుంగిపోయాను. అప్పుడు గంగూలీ జట్టులో స్థానం కలిపించాడు. ఆ తర్వాత నా కెరీర్ మొత్తం ప్రోత్సాహిస్తూ వచ్చాడు. గంగూలీ కి నా కృతజ్ఞతలు అని తెలిపాడు. ఇక 2007, 2011లో ప్రపంచ కప్ లు గెలవడం స్వీట్ మెమోరీస్ అని పేర్కొన్నాడు.

అప్పట్లో భీకరమైన ఫామ్ లో ఉన్న ఆస్ట్రేలియా జట్టు ఇండియాతో మూడు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ ఆడేందుకు ఇండియాకి వచ్చింది. అనుకున్నట్టుగానే మొదటి టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు ఓటమి చవిచూసింది. ఇక రెండో టెస్ట్ లో కూడా అదే పరిస్థితి కనిపించింది. మొదటి ఇన్నింగ్స్ లో 445 పరుగులు చేసి అల్ అవుట్ ఆసీస్ జట్టు , ఆ తర్వాత భారత జట్టును కేవలం 171 పరుగులకే అల్ అవుట్ చేసింది. దీనితో భారత జట్టు ఫాలో ఆన్ అడాల్సిన అవసరం ఏర్పడింది. అప్పుడు రాహుల్ ద్రావిడ్ (180), వీవీయస్ లక్ష్మణ్ (281) పరుగులు చేసి 658 పరుగుల లక్షాన్ని ఆసీస్ ముందుంచారు.

ఆ తరుణంలో బంతితో హర్భజన్ సింగ్ తన విశ్వరూపం చూపించాడు. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో హ్యాట్రిక్ సాధించి 13 వికెట్లతో మ్యాచ్ ముగించాడు.. ఆ సిరీస్ కి జవగళ్ శ్రీనాథ్, అనిల్ కుంబ్లే జట్టుకు దూరమవ్వడంతో భజ్జీ జట్టులోకి తీసుకున్నారు. ఈ సిరీస్‌కు ముందు ముగ్గురు స్పిన్నర్లను పరీక్షించింది సెలక్షన్ కమిటి.. కానీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాత్రం హర్బజన్ కావాలని పట్టుబట్టడంతో జట్టులోకి వచ్చాడు. మ్యాచ్ లో అద్బుతమైన ప్రదర్శనని కనబరిచి కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టాడు. ఇక అప్పటికే వరుసగా 16 టెస్టులు గెలిచి జోష్ మీద ఉన్న ఆసీస్ కి భారత జట్టు ఈ మ్యాచ్ తో బ్రేక్ వేసింది. ఈ సిరీస్ లో భాగంగా హర్బజన్ సింగ్ 32 వికెట్ల తీసి సిరీస్ కి మ్యాన్ అఫ్ ది సిరీస్ గా ఎంపికయ్యాడు. ఇక ఆ తర్వాత హర్బజన్ వెనుకకి తిరిగి చూసుకుంది లేదు.

Web TitleHarbhajan singh remember memory's with sourav ganguly

లైవ్ టీవి


Share it
Top