రాజకీయాల్లోకి రావడంపై స్పందించిన గంభీర్

రాజకీయాల్లోకి రావడంపై స్పందించిన గంభీర్
x
Highlights

టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ త్వరలో రాజకీయాల్లోకి రానున్నట్టు కొంతకాలంగా సామాజిక మాధ్యమాల్లో వార్తలు హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.. అయితే...

టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ త్వరలో రాజకీయాల్లోకి రానున్నట్టు కొంతకాలంగా సామాజిక మాధ్యమాల్లో వార్తలు హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ వార్తలను గౌతమ్ గంభీర్ ఖండించకపోవడంతో ఆయన రాజకీయాల్లోకి రావడం ఖాయమని అందరూ భావించారు. అయితే ఇవాళ ఆ వార్తలకు పులుస్టాప్ పడింది. రాజకీయాల్లోకి వస్తున్నట్టు జరుగుతున్న ప్రచారంపై స్పందించాడు గంభీర్.

తాను రాజకీయాల్లోకి రాబోవడం లేదని స్పష్టం చేశాడు. ఆ ఊహాజనిత వార్తల్లో వాస్తవం లేదని కొట్టి పడేశాడు. ప్రస్తుతానికి తాను రిటైర్డ్ క్రికెటర్‌ను మాత్రమేనని పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న భారత జట్టు సిరీస్ గెలుపు కోసం అందరిలా తాను కూడా వేచి చూస్తున్నట్టు చెప్పాడు. కాగా ఇటీవలే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన ఈ స్టార్ ఆటగాడు.. బీజేపీలో చేరబోతున్నాడంటూ వార్తలు హల్‌చల్ చేశాయి. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీ లేదా ఎమ్మెల్యేగా గంభీర్ పోటీ చేయబోతున్నాడంటూ పుకార్లు షికారు చేశాయి. కానీ ఈ తాజా ట్వీట్‌తో ఈ పుకార్లకు ఫుల్‌స్టాప్ పడినట్లయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories