Top
logo

ప్రపంచకప్‌ భారత జట్టు ఇదే: గంభీర్‌

ప్రపంచకప్‌ భారత జట్టు ఇదే: గంభీర్‌
X
Highlights

2019 ఐసీసీ ప్రపంచకప్‌ మహా సంగ్రామం మే 30 నుంచి ప్రారంభం కానుంది. దీంతో క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా...

2019 ఐసీసీ ప్రపంచకప్‌ మహా సంగ్రామం మే 30 నుంచి ప్రారంభం కానుంది. దీంతో క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రపంచకప్‌ జట్టులో ఎవరికీ జట్టులో స్థానం దక్కుతుందో అని ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో వన్డే ప్రపంచ కప్‌ 2019లో పాల్గొనే భారత జట్టుని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ప్రకటించాడు. మొత్తం 15 మందితో కూడిన జట్టులో యువ ఆటగాడు రిషభ్‌​ పంత్‌కు గంభీర్‌ అవకాశమివ్వలేదు. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు పూర్తిగా దూరమైన స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు కూడా స్థానం కల్పించాడు. ఇటీవల కాఫీ విత్ కరణ్ షో లో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్న కేఎల్‌ రాహుల్‌, హార్థిక్‌ పాండ్యాలకు తన జట్టులో అవకాశమిచ్చాడు.

గంభీర్ ప్రకటించిన జట్టులో స్థానం సంపాదించి వీరే..

విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, అంబటి రాయుడు, కేదార్‌ జాదవ్‌, దినేశ్‌ కార్తీక్‌, ఎంఎస్‌ ధోని, హార్థిక్‌ పాండ్యా, జస్ప్రిత్‌ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమీ, చహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌

Next Story