మొదటి వికెట్ కోల్పోయిన వెస్టిండీస్:గేల్ అవుట్!

మొదటి వికెట్ కోల్పోయిన వెస్టిండీస్:గేల్ అవుట్!
x
Highlights

వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఈరోజు ఆఫ్ఘనిస్థాన్, వెస్టిండీస్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ బ్యాటింగ్ చేస్తోంది. వరల్డ్ కప్ లో తన...

వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఈరోజు ఆఫ్ఘనిస్థాన్, వెస్టిండీస్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన వెస్టిండీస్ బ్యాటింగ్ చేస్తోంది. వరల్డ్ కప్ లో తన చివరి మ్యాచ్ ఆడుతున్న క్రిస్ గేల్ ఏడు పరుగులకు పెవిలియన్ చేరాడు. ఈ ప్రపంచకప్‌లో క్రిస్‌గేల్‌ (7; 18 బంతుల్లో) పూర్తిగా నిరాశపరిచాడు. చివరి మ్యాచ్‌లోనూ స్వల్ప స్కోరుకే ఔటయ్యాడు. దవ్లత్‌ వేసిన 5.3వ బంతిని ఆడబోయి కీపర్‌ ఇక్రమ్‌ అలీ ఖిల్‌కు చిక్కాడు. దీంతో పది ఓవర్లు ముగిసే సరికి వెస్టిండీస్ 43/1 స్కోరుతో వుంది. ఎవిన్‌ లూయిస్‌ (25), హోప్‌ (9) క్రీజులో ఉన్నారు. ఇప్పటికే సెమీస్ అవకాశాలు కోల్పోయిన ఈ రెండు టీములకు ఇది నామమాత్రపు మ్యాచ్. అయినా..విండీస్ పరువు దక్కించుకోవాలంటే ఈ మ్యాచ్ అయినా గెలవాల్సి ఉంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories