ఫ్రెంచ్ ఓపెన్ ప్రారంభం

ఫ్రెంచ్ ఓపెన్ ప్రారంభం
x
Highlights

ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ సమరం ప్రారంభమైంది. ఆదివారం మహిళల సింగిల్స్ లో మూడు పోటీలు జరిగాయి. జర్మనీ కి చెందిన 5 వ రాంక్ క్రీడాకారిణి అన్జేలిక్ కేర్బార్...

ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ సమరం ప్రారంభమైంది. ఆదివారం మహిళల సింగిల్స్ లో మూడు పోటీలు జరిగాయి. జర్మనీ కి చెందిన 5 వ రాంక్ క్రీడాకారిణి అన్జేలిక్ కేర్బార్ పై రష్యాకు చెందినా 81 వ రాంక్ క్రీడాకారిణి అనస్తాసియా పోటాపోవా వరుస సెట్లలో విజయం సాధించింది. ఆమె వరుసగా 6-4, 6-2 పాయింట్లతో రెండో రౌండ్ కు చేరుకుంది.

రెండో మ్యాచులో 31 వ రాంక్ క్రొయేషియ క్రీడాకారిణి పెట్రా మార్టిక్ ట్యునీషియా కు చెందిన ఆన్ జబీర్ (55 వ రాంక్) క్రీదాకారినిపై సునాయాస విజయాన్ని సాధించింది. మార్టిక్ 6-1,6-2 పాయింట్లతో గెలుపొందింది.

మూడో మ్యాచులో స్లోవేకియకు చెందిన 74 వ రాంక్ క్రీడాకారిణి మగ్దలేనా రైబారికోవా, స్వీడన్ కు చెందిన 72 వ రాంక్ క్రీడాకారిణి జోహాన్న లారసన్ పై 6-3,6-4 స్కోరుతో విజయం సాధించి రెండో రౌండ్ కు చేరుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories