ఆ ఉత్కంఠపోరు జరిగి నేటికి నాలుగేళ్లు!

ఆ ఉత్కంఠపోరు జరిగి నేటికి నాలుగేళ్లు!
x
Dhoni and hardik pandya (file photo)
Highlights

బంగ్లాదేశ్... ఓ పసికూనగా క్రికెట్లోకి అడుగుపెట్టి... ఇప్పుడు ప్రత్యర్థి జట్లకు సవాలుగా మారింది.

బంగ్లాదేశ్... ఓ పసికూనగా క్రికెట్లోకి అడుగుపెట్టి... ఇప్పుడు ప్రత్యర్థి జట్లకు సవాలుగా మారింది. ఎవ్వరు ఊహించని విజయాలు అందుకుని తమ సత్తా ఏంటో చాలా సార్లు నిరూపించుకుంది.. ఇక 2007 ప్రపంచ కప్ తర్వాత బలమైన జట్టుగా నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అదే ప్రపంచ కప్ లో భారత్ ను ఓడించి సంచలన విజయాన్ని సాధించింది. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు బంగ్లాదేశ్ భారత్ కి మరో దాయాది జట్టుగా మారింది. ఇక 2016 టీ20 ప్రపంచకప్‌ లీగ్‌ మ్యాచ్‌ లో భారత్ , బంగ్లాదేశ్ జట్లు తలపడ్డాయి .. అయితే ఈ మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగింది.. కానీ ఫలితంగా ఒక్క పరుగు తేడాతో భారత్ పైచేయి సాధించింది.. ఆ ఉత్కంఠ పోరుకి నేటికి నాలుగేళ్ళు...

ఈ ప్రపంచ కప్ కి ఆతిథ్యం ఇచ్చిన భారత్ మొదటి మ్యాచ్లో న్యూజిలాండ్ జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్లో భారత్ 24 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆ తర్వాత తన రెండో మ్యాచ్ ని పాకిస్తాన్ తో ఆడింది. కానీ ఇందులో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ తర్వాత తన మూడో మ్యాచ్ ని బంగ్లాదేశ్ తో తలపడింది. ఈ మ్యాచ్లో భారత్ మొదటగా బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి146 పరుగులు చేసింది. సురేశ్‌ రైనా(30) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. దీనితో భారత్ ఓటమి ఖాయమని అందరూ అనుకున్నారు..

ఇక 147 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ ని భారత బౌలర్లు కట్టడి చేశారు.. బంగ్లాదేశ్ జట్టులో ఓపెనర్‌ తమిమ్‌ ఇక్బాల్‌(35) రాణించినా అతడికి సహకరించే బ్యాట్స్‌మన్‌ లేకపోయారు.. ఇక చివరి ఓవర్‌లో బంగ్లా విజయానికి 11 పరుగులు అవసరం ఉన్నాయి. ఈ నేపథ్యంలో అప్పటి భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ బంతిని హార్దిక్‌ పాండ్య చేతికి ఇచ్చాడు. ఈ క్రమంలో తొలి బంతికి సింగిల్‌ ఇచ్చిన పాండ్య.. తర్వాతి రెండు బంతులలో రెండు ఫోర్లు ఇచ్చాడు. ఆ తర్వాతి 3 బంతుల్లో 2 పరుగులుగా మ్యాచ్ మారింది.

ఆ తర్వాత ధోనీ చాకచక్యంగా వ్యవహరించి పాండ్యా తో చర్చించగా ఆ తర్వాత పాండ్య వేసిన రెండు వరుస బంతుల్లో రహీమ్‌, మహ్మదుల్లాను ఔట్‌ అయ్యారు. ఇక చివరి బంతికి రెండు పరుగులు చేసి మ్యాచ్ టై చేద్దాం అనుకున్న బంగ్లా జుట్టుకి ధోని శాపంగా మారాడు. బై రన్స్‌ తీద్దామని యత్నించగా ధోనీ నేరుగా వచ్చి వికెట్లను తాకడంతో ముస్తాఫిజుర్‌ ఔటయ్యాడు. దీనితో భారత్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. కానీ ఆ మ్యాచ్లో పసికూనపై గెలవడానికి భారత్ బాగానే శ్రమించాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాత ఆస్ట్రేలియాతో తలపడి, గెలిచి సెమీస్ కి చేరిన భారత్ వెస్టిండీస్ జట్టుపై ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక ఫైనల్ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టుతో పోరాడి విజేతగా నిలిచింది వెస్టిండీస్.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories