కరోనా వైరస్‌తో పాక్ మాజీ క్రికెటర్ మృతి

కరోనా వైరస్‌తో పాక్ మాజీ క్రికెటర్ మృతి
x
Former Pakistan First-class Cricketer Zafar Sarfraz Dies of Coronavirus
Highlights

కరోనా వైరస్ కారణంగా పాకిస్థాన్‌కి చెందిన స్వ్కాష్ ప్లేయర్ అజామ్ ఖాన్ (95) ఇటీవల మృతి చెందిన విషయం అందరికి తెలిసిందే..

కరోనా వైరస్ కారణంగా పాకిస్థాన్‌కి చెందిన స్వ్కాష్ ప్లేయర్ అజామ్ ఖాన్ (95) ఇటీవల మృతి చెందిన విషయం అందరికి తెలిసిందే.. అయితే ఇప్పుడు కరోనాతో మరో ఆటగాడు మృతి చెందాడు. 1988-94 మధ్యకాలంలో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌‌ ఆడిన జాఫర్ సర్ఫరాజ్(50)‌ కరోనాతో పోరాడి మృతి చెందాడు. ఈ నెల 7న జాఫర్ సర్ఫరాజ్ కి కరోనా వైరస్ పాజిటివ్‌ అని తెలియడంతో ఆసుపత్రిలో చేరాడు. అనంతరం గత మూడు రోజుల నుంచి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తుండగా ఈ రోజు చివరి శ్వాస విడిచాడు.

ఎడమచేతి వాటం ఆల్‌రౌండర్‌గా ఉన్న జాఫర్.. ఇప్పటివరకు 15 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ లు ఆడి 616 పరుగులు చేశాడు. ఇక 1994లో క్రికెట్‌కి వీడ్కోలు చెప్పి అనంతరం కోచ్‌గా మారాడు. జాఫర్ సోదరుడు అక్తర్ సర్ఫరాజ్ కూడా క్రికెటరే కావడం విశేషం. పాక్ తరఫున అతను నాలుగు అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు ఆడి 1998లో రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక పాకిస్తాన్‌లో ఇప్పటివరకు 96 మరణాలతో సహా 5,000 మందికి పైగా కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories