ధోనీ టీమ్‌ ఇండియాకు విలువైన ఆస్తి: వసీం జాఫర్‌

ధోనీ టీమ్‌ ఇండియాకు విలువైన ఆస్తి: వసీం జాఫర్‌
x
MS Dhoni (file photo)
Highlights

టీంఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ టీమ్‌ ఇండియాకు విలువైన ఆస్తి అని అభిప్రాయపడ్డాడు ఇండియన్ మాజీ క్రికెటర్ వసీం జాఫర్‌.

టీంఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ టీమ్‌ ఇండియాకు విలువైన ఆస్తి అని అభిప్రాయపడ్డాడు ఇండియన్ మాజీ క్రికెటర్ వసీం జాఫర్‌.. జాఫర్‌ తన ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ.. ధోనీ ఫిట్‌గా ఉండి ఫామ్‌లో ఉంటే అతడిని మించి చూడాల్సిన అవసరం లేదని అన్నాడు. ఒకవేళ ధోనిని ఆడిస్తే కేఎల్‌ రాహుల్‌ పై భారం తగ్గుతుందని అన్నాడు. ఇక పంత్‌ను కూడా లెఫ్ట్‌హ్యాండ్‌ బ్యాట్స్‌మన్‌గా చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చునని జాఫర్ వెల్లడించాడు. గత ఏడాది జరిగిన వరల్డ్ కప్ తర్వాత ధోని మళ్ళీ జట్టులో ఆడింది లేదు. ఇటీవల ఐపీఎల్‌ కోసం ప్రాక్టిస్ మొదలుపెట్టినప్పటికీ కరోనా ప్రభావం వలన ఏప్రిల్ 15 వరకు వాయిదా పడింది. దీంతో ధోని చెన్నై నుంచి రాంచీకి వెళ్ళిపోయాడు.

దాదాపు 25 సంవత్సరాల పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో పరుగుల మోత మోగించిన 42 ఏళ్ల జాఫర్.. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు ఇటివల ప్రకటించాడు. భారత్ తరఫున 31 టెస్టులు ఆడిన జాఫర్ 1944 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు, 11 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 212. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 260 మ్యాచ్ లు ఆడిన అతను ఏకంగా 19,410 పరుగులు సాధించాడు. రంజీ ట్రోఫీలో 150 మ్యాచ్ లు ఆడిన తొలి క్రికెటర్ గా నిలిచిన జాఫర్ ముంబైని రెండు సార్లు విజేతగా నిలిపాడు. అలాగే, గత మూడు సీజన్ల నుంచి విదర్భ జట్టుకు ప్రాతినిధ్యం వహించి రెండు టైటిళ్లు అందించాడు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories