Top
logo

హమ్మయ్య వికెట్ పడింది!

హమ్మయ్య వికెట్ పడింది!
Highlights

22 ఓవర్లు.. ఒక్క వికెట్టూ పడలేదు.. స్కోరు 160 పరుగులు.. దాదాపుగా ఓవర్ కి 7 పరుగులకు పైగానే రన్ రేట్. ఇదీ...

22 ఓవర్లు.. ఒక్క వికెట్టూ పడలేదు.. స్కోరు 160 పరుగులు.. దాదాపుగా ఓవర్ కి 7 పరుగులకు పైగానే రన్ రేట్. ఇదీ ఇంగ్లాండ్ బ్యాటింగ్ జోరు. ఒపెనర్లిద్దరూ చెలరేగిపోతున్న వేళ.. పాత రికార్డులు బద్దలయ్యేలా కనిపిస్తున్న సమయంలో ఎట్టకేలకు ఇంగ్లాండ్ ఓపెనింగ్ జోడీని విడదీశాడు కుల్దీప్. 23 వ ఓవర్ తొలి బంతిని రాయ్ తన స్టైల్ లో భారీ షాట్ ఆడాడు. అయితే, లంగాన్ వద్ద సబ్సిట్యూట్ ఫీల్డర్ జడేజా పట్టిన అద్భుత క్యాచ్ తో పెవిలియన్ చేరాడు. రాయ్ 57 బంతుల్లో 66 పరుగులు చేశాడు. అటు తరువాత ఓవర్ కు బుమ్రా బౌలింగ్ కు వచ్చాడు. 24 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్ జట్టు ఒక్క వికెట్ నష్టపోయి 173 పరుగులు చేసి పటిష్ట స్థితిలో ఉంది. బెయిర్ స్తా 96 పరుగులతోనూ, రూట్ 10 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు.


లైవ్ టీవి


Share it
Top