అజహరుద్దీన్‌పై ఎఫ్‌ఐఆర్‌.. కేసుపై వివరణ ఇచ్చిన అజహరుద్దీన్‌

అజహరుద్దీన్‌పై ఎఫ్‌ఐఆర్‌.. కేసుపై వివరణ ఇచ్చిన అజహరుద్దీన్‌
x
ఫైల్‌ ఫోటో
Highlights

టీమిండియా మాజీ కెప్టెన్‌ అజహరుద్దీన్‌పై ఔరంగాబాద్‌లో కేసు నమోదైంది. మహారాష్ట్రకు చెందిన ఒక ట్రావెల్‌ ఏజెంట్‌ను మోసం చేశారనే ఆరోపణలపై అజహరుద్దీన్‌తో...

టీమిండియా మాజీ కెప్టెన్‌ అజహరుద్దీన్‌పై ఔరంగాబాద్‌లో కేసు నమోదైంది. మహారాష్ట్రకు చెందిన ఒక ట్రావెల్‌ ఏజెంట్‌ను మోసం చేశారనే ఆరోపణలపై అజహరుద్దీన్‌తో సహా మరో ఇద్దరిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఔరంగాబాద్‌కు చెందిన షాహబ్‌ మొహమ్మద్‌ అనే ట్రావెల్‌ ఏజెంట్‌ అజహరుద్దీన్‌తో పాటు మరో ఇద్దరు కలిసి తనను రూ. 20 లక్షల మేర మోసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మజీబ్‌ఖాన్‌, సుధీష్‌ అవిక్కల్‌, మహమ్మద్‌ అజహరుద్దీన్‌లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

అయితే తనపై వస్తున్న ఆరోపణలు, ఎఫ్‌ఐఆర్‌ నమోదు కావడంపై అజహరుద్దీన్‌ స్పందించారు. ఔరంగాబాద్‌ పోలీసులు తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ అర్థం లేనిదని ఖండించారు. తప్పుడు ఆరోపణలపై కేసు ఎలా నమోదు చేస్తారని ప్రశ్నించారు. అంతేకాకుండా దీనిపై తాను న్యాయ పోరాటం చేస్తానని పేర్కొన్నారు. అదేవిధంగా రూ. 100 కోట్లకు పరువు నష్టం దావా వేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories