స్టేడియం హోరెత్తింది!

స్టేడియం హోరెత్తింది!
x
Highlights

మాంచెస్టర్ లో ఈరోజు జరుగుతున్న టీమిండియా, పాకిస్థాన్ మ్యాచ్ కు ప్రేక్షకులు పోటెత్తారు. స్టేడియం మొత్తం అభిమానులతో నిండిపోయింది. ముఖ్యంగా మూడు వొంతుల...

మాంచెస్టర్ లో ఈరోజు జరుగుతున్న టీమిండియా, పాకిస్థాన్ మ్యాచ్ కు ప్రేక్షకులు పోటెత్తారు. స్టేడియం మొత్తం అభిమానులతో నిండిపోయింది. ముఖ్యంగా మూడు వొంతుల మంది టీమిండియా అభిమానులే స్టేడియంలో కనిపిస్తున్నారు. ఇక మన ఓపెనర్లు పాకిస్థాన్ పై నిదానంగా చెలరేగిపోయారు. ముఖ్యంగా రోహిత్ శర్మ బ్యాటింగ్.. అద్భుతంగా సాగుతోంది. రోహిత్ బౌండరీ.. ఆఖరికి సింగిలే తీసినా సరే స్టేడియం ఇండియా అనుకూల నినాదాలతో మారుమోతుతోంది. ఇక రోహిత్ సెంచరీ చేసిన పరుగు కోసం అయితే స్టేడియం మొత్తం లేచినిలబడిపోయింది. వరల్డ్ కప్ టోర్నీ లో ఇప్పటి వరకూ 21 మ్యాచ్ లు జరిగాయి.( వాటిలో కొన్ని వర్షార్పణమూ అయ్యాయి) అయితే, వీటిలో ఏ మ్యాచ్ కూ లేని స్పందన ఈ మ్యాచ్లో అభిమానుల నుంచి వస్తోంది. టీమిండియా గెలవాలని అందరూ కోరుకుంటున్నారు.

ఐసీసి తన ట్విట్టర్ లో రోహిత్ శర్మ సెంచరీ సమయంలో అభిమానుల స్పందన పోస్ట్ చేసింది. రండి మీరూ ఓ లుక్కేయండి..ఎంత అద్భుతంగా ఉందొ చూడండి..




Show Full Article
Print Article
More On
Next Story
More Stories