అంతకు మించి ... ప్రపంచ కప్ విజేత ఇంగ్లాండ్

అంతకు మించి ... ప్రపంచ కప్ విజేత ఇంగ్లాండ్
x
Highlights

ప్రపంచ కప్ లో అంతిమ పోరు ముగిసింది.. అన్ని జట్లను దాటుకుంటూ అంతకుమించి సూపర్ ఓవర్ ని దాటుకుంటూ ప్రపంచ కప్ విజేత గా ఇంగ్లాండ్ నిలిచింది.. దీనితో వరల్డ్...

ప్రపంచ కప్ లో అంతిమ పోరు ముగిసింది.. అన్ని జట్లను దాటుకుంటూ అంతకుమించి సూపర్ ఓవర్ ని దాటుకుంటూ ప్రపంచ కప్ విజేత గా ఇంగ్లాండ్ నిలిచింది.. దీనితో వరల్డ్ కప్ ని తొలిసారిగా ముద్దాడింది ఇంగ్లాండ్. హై టెంక్షన్ మ్యాచ్ క్రియేట్ చేస్తూ ముందుగా మ్యాచ్ టైగా మిగిలిపోయింది. ఆ తర్వాత సూపర్ ఓవర్ లో భాగంగా మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ ఆరు బంతుల్లో 15 పరుగులు చేసింది.. ఆ తర్వాత బ్యాటింగ్ కి దిగిన న్యూజిలాండ్ కూడా ఆరు బంతుల్లో 15 పరుగులు మాత్రమే చేసింది. కానీ చివరి ఓవర్లో ఇంగ్లాండ్ ఎక్కువ బౌండరీలు సాధించడంతో ఇంగ్లాండ్ విజేతగా నిలిచింది..

స్టోక్స్ అద్భుతమైన బ్యాటింగ్ తో ఇంగ్లాండ్ కి కప్పును అందించాడనే చెప్పాలి . అటు సుపర్ ఓవర్ లో ఇటు మ్యాచ్ లో భాగంగా జరిగే ఓవర్ లో పరుగులు చేసి మ్యాచ్ ని గెలిపించి ఇంగ్లాండ్ కి కప్పును తెచ్చిపెట్టాడు.. మొదటగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ జట్టు నిర్ణిత 50 ఓవర్లో ఎనమిది వికెట్లను గాను 241 పరుగులు చేసింది..242 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ని న్యూజిలాండ్ బౌలర్లు అది నుండే అది నుండే కట్టుదిట్టం చేసుకుంటూ వచ్చారు.. కానీ చివరిలో స్టోక్స్ అద్భుతమైన బ్యాటింగ్ తో స్కోర్ ని లెవల్ చేసాడు..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories