logo

న్యూజిలాండ్ చిత్తు చిత్తు.. సెమిస్ లోకి దర్జాగా ఇంగ్లాండ్ ..

న్యూజిలాండ్ చిత్తు చిత్తు.. సెమిస్ లోకి దర్జాగా ఇంగ్లాండ్ ..
Highlights

ఆతిధ్య జట్టు ఇంగ్లాండ్ సెమిస్ కి చేరింది . అటు బ్యాటింగ్ లోను ఇటు బౌలింగ్ లోను ఆధిపత్య పోరును కనబరిచి...

ఆతిధ్య జట్టు ఇంగ్లాండ్ సెమిస్ కి చేరింది . అటు బ్యాటింగ్ లోను ఇటు బౌలింగ్ లోను ఆధిపత్య పోరును కనబరిచి న్యూజిలాండ్ ని చిత్తూ చిత్తుగా ఓడించి సెమిస్ లోకి దర్జాగా దూసుకువెళ్ళింది . 1992 ప్రపంచ కప్ తర్వాత అ జట్టు సెమిస్ కి చేరడం ఇదే తొలిసారి కావడం విశేషం . మొదటగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లిష్ జట్టు నిర్ణిత 50 ఓవర్లో ఎనమిది వికెట్లను కోల్పోయి 305 పరుగులు చేసింది . బెయిర్ స్టో(106; 99 బంతుల్లో 15×4, 1×6) మరో సారి సెంచరీతో కదం తొక్కాడు . ఇక మరో బాట్స్ మెన్ జేసన్‌ రాయ్‌ (60; 61 బంతుల్లో 8×4) మెరవడంతో ఇంగ్లాండ్ ఇంతటి భారీ స్కోర్ చేయగలిగింది . ఇక లక్ష్య చేదన కి బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టు ఎక్కడ కూడా పోటీని కూడా ఇవ్వకుండా కేవలం 186 పరుగులకే కుప్పకూలింది . దీనితో ఇంగ్లాండ్ 119 పరుగుల తేడాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది .దీనితో అ జట్టు 12 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది .

పాకిస్తాన్ అవుట్ :

పాకిస్థాన్ జట్టు టోర్నీ నుండి నిష్క్రమించింది అనే చెప్పాలి .ఒకవేళ కివీస్ జట్టు తన చివరి లీగ్ మ్యాచ్ లో ఓడిపోయినా అ జట్టు సెమిస్ కి చేరడం అనేది లంచానమే అవుతుంది . ఎందుకంటే కివీస్ ప్రస్తుతం 11 పాయింట్లతో 0.175 రన్ రేట్ నాలుగో స్థానంలో ఉంది . దానికి ముందు ఆస్ట్రేలియా (14), భారత్‌ (13), ఇంగ్లాండ్‌ (12) జట్లు ఉన్నాయి . ఐదో స్థానంలో పాకిస్తాన్ 9 పాయింట్లతో -0.792. రన్ రేట్ తో ఉంది . పాకిస్తాన్ తన చివరి మ్యాచ్ గెలిస్తే 11 పాయింట్లతో న్యూజిలాండ్ తో సమం అవుతుంది కానీ పాకిస్తాన్ కనీసం 316 పరుగుల తేడాతో గెలిస్తేనే అ జట్టుకు సెమిస్ అవకశాలు ఉన్నాయి . ఇది అసాధ్యం కాబట్టి పాకిస్తాన్ సెమిస్ ఆశలు గల్లంతు అయ్యాయనే చెప్పాలి ..


లైవ్ టీవి


Share it
Top