ప్రపంచ కప్ ముందు ఇంగ్లాండ్ భారీ విజయం

ప్రపంచ కప్ ముందు ఇంగ్లాండ్ భారీ విజయం
x
Highlights

ఇంగ్లాండ్ జట్టు ముందు ఎంత పెద్ద లక్ష్యమైన చిన్నబోతోంది. పాకిస్తాన్ తో జరుగుతున్నవన్డే పోరులో రెండో వన్డేలో 359 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించిన...

ఇంగ్లాండ్ జట్టు ముందు ఎంత పెద్ద లక్ష్యమైన చిన్నబోతోంది. పాకిస్తాన్ తో జరుగుతున్నవన్డే పోరులో రెండో వన్డేలో 359 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించిన ఇంగ్లాండ్ ఆఖ్రు డీ మూడోది అయినా మ్యాచ్లో మళ్ళీ 340 పరుగుల లక్ష్యాన్ని సింపుల్గా ఊదేసింది. దీంతో నాలుగు వన్డేల సిరీస్ ను 3 - 0 తేడాతో( ఒక వన్డే వర్షం కారణంగా రద్దయింది) గెలుచుకుని ప్రపంచ కప్ ముందు ఆత్మవిశ్వాసాన్ని మూటగట్టుకుంది.

మొదట పాక్‌ 50 ఓవర్లలో 7 వికెట్లకు 340 పరుగులు చేసింది. బాబర్‌ ఆజం (115) సెంచరీతో చెలరేగా.. ఫఖర్‌ జమాన్‌ (57), మహ్మద్‌ హఫీజ్‌ (59) రాణించారు. ఇంగ్లాండ్‌ 49.3 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ (114; 89 బంతుల్లో 11×4, 4×6), బెన్‌ స్టోక్స్‌ (71 నాటౌట్‌) సత్తాచాటారు. తొలి వన్డే వర్షార్పణం కాగా.. తర్వాతి 3 వన్డేల్లో గెలుపొందిన ఇంగ్లాండ్‌ 3-0తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ అద్భుత శతకం ఇంగ్లాండ్ ను విజయతీరానికి చేర్చింది. ఇక ఇంగ్లాండ్ కు ఇది వరుసగా 17 వ చేసింగ్ విజయం.


Show Full Article
Print Article
Next Story
More Stories