టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ .. టీమిండియా లోకి రిషబ్ పంత్

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ .. టీమిండియా లోకి రిషబ్ పంత్
x
Highlights

సమవుజ్జీల హోరాహోరీకి రంగం సిద్ధమైంది. వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్, ఇండియా టీముల మధ్య ఇప్పటివరకూ ఏడూ మ్యాచ్లు జరిగాయి. వాటిలో మూడు ఇండియా, మూడు ఇంగ్లాండ్...

సమవుజ్జీల హోరాహోరీకి రంగం సిద్ధమైంది. వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్, ఇండియా టీముల మధ్య ఇప్పటివరకూ ఏడూ మ్యాచ్లు జరిగాయి. వాటిలో మూడు ఇండియా, మూడు ఇంగ్లాండ్ గెల్చుకున్నాయి. ఒకటి టై అయింది. ఈ రోజు ఈ రెండు టీముల మధ్య రసవత్తర పోరు సాగనుంది. ఇప్పటివరకూ టోర్నీలో అపజయమే ఎరుగకుండా దూకుడుగా సాగుతోంది టీమిండియా. తొలి మ్యాచుల్లో అదర గొట్టే ప్రదర్శన చేసి.. ఫేవరేట్ లలో టాప్ ప్లేస్ ఇంగ్లాండ్ దే అనుకునేలా చేసిన టీము తరువాత వరుస పరాజయాలతో.. సెమీస్ అవకాశాల్ని సంక్లిష్టం చేసుకుంది. ఈ రోజు జరిగే మ్యాచ్ లో తప్పనిసరిగా గెలవాల్సిన ఒత్తిడిలో ఇంగ్లాండ్ ఉంది. మరో వైపు పూర్తి స్థాయిలో జట్టుగా సమిష్టి ప్రదర్శనతో వరల్డ్ కప్ లో అందర్నీ ఆకట్టుకుని విజయాల పరంపరతో సాగుతున్న ఇండియా ఈమ్యాచ్ గెలిస్తే సెమీస్ కు చేరినట్టే. అందుకే ఈ మ్యాచ్ ఓ అద్భుతమైన క్రికెట్ పోరును చూపిస్తుందని అందరూ భావిస్తున్నారు.

కొద్ది సేపట్లో ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇండియా జట్టులో ఓ మార్పు చోటుచేసుకుంది. నాలుగో స్థానం లో బ్యాటింగ్ చేస్తున్న విజయ్ శంకర్ వరుసగా విఫలం కావడంతో.. అందరూ ఊహించినట్టే రిషబ్ పంత్ ను జట్టులోకి తీసుకుంది.

ఇంగ్లాండ్ టీం..

జె బెయిర్‌స్టో, జె రాయ్, జె రూట్, ఇ మోర్గాన్, బి స్టోక్స్, జె బట్లర్, సి వోక్స్, ఎల్ ప్లంకెట్, ఎ రషీద్, జె ఆర్చర్, ఎం వుడ్

ఇండియా టీం...

రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, వి కోహ్లీ, ఆర్ పంత్, కె జాదవ్, ఎంఎస్ ధోని, హెచ్ పాండ్యా, కె యాదవ్, ఎం షమీ, వై చాహల్, జె బుమ్రా


Show Full Article
Print Article
More On
Next Story
More Stories