ఇంగ్లాండ్ గెలుపు ఖాయం

ఇంగ్లాండ్ గెలుపు ఖాయం
x
Highlights

అద్భుతాలకు అవకాశం లేదు. సగం ఓవర్లు అయిపోయాయి. ఇంకా మిగిలిన సగం ఓవర్లలో చేయాల్సిన స్కోరు 294 . వికెట్లూ మూడు పడిపోయాయి. అవతల పక్క ఇంగ్లాండ్. పాపం...

అద్భుతాలకు అవకాశం లేదు. సగం ఓవర్లు అయిపోయాయి. ఇంకా మిగిలిన సగం ఓవర్లలో చేయాల్సిన స్కోరు 294 . వికెట్లూ మూడు పడిపోయాయి. అవతల పక్క ఇంగ్లాండ్. పాపం పసికూన ఆఫ్ఘన్ పరిస్థితి ఇది. వరల్డ్ కప్ టోర్నీలో భాగం ఈరోజు ఇంగ్లాండ్ తో తలబడుతున్న ఆఫ్ఘన్ పోరాటం చేస్తోంది. గెలుపు కోసం కాదు.. గెలుపు అంతరాన్ని తగ్గించుకోవడానికి. ఇంగ్లాండ్ బౌలింగ్ లో వికెట్లు పడకుండా కొద్దిగా కాచుకోగలిగారు గానీ పరుగులు మాత్రం తీయలేకుండా ఉన్నారు. నాలుగు పరుగులకే మొదటి వికెట్ కోల్పోయింది ఆఫ్ఘన్. నూర్ అలీ పరుగులేమీ చేయకుండా పెవిలియన్ చేరాడు. తరువాత నాయబ్. షా రెండో వికెట్ పడకుండా 52 పరుగులకు స్కోరు చేర్చారు. ఈ దశలో నాయబ్ అవుటయ్యాడు. తరువాత షా.. అసమతుల్లా షాహిదీ తో కల్సి స్కోరు బోర్డును కదిలించే ప్రయత్నం చేశాడు కానీ,104 పరుగుల వద్ద అది ముగిసింది. అప్పటికే 25 ఓవర్లు పూర్తయిపోయాయి. ఇంకా విజయానికి 294 పరుగులు చేయాల్సి ఉంది.. 24 ఓవర్లు ఉన్నాయి. ఇంగ్లాండ్ గెలుపు ఖాయమే.. ఎంత తేడా అన్నదే ఇక్కడి ప్రశ్న.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories