వర్షం వచ్చిందా.. ఇంగ్లాండ్ ఇంటికే!

వర్షం వచ్చిందా.. ఇంగ్లాండ్ ఇంటికే!
x
Highlights

వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీలో పది జట్లు పోటీ పడుతుంటే.. పదకొండో జట్టులా వరుణుడు ఆడుకుంటున్న విషయం తెలిసిందే. ప్రారంభంలో వరుసగా వర్షాలుకురిసి మ్యాచ్ లకు...

వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీలో పది జట్లు పోటీ పడుతుంటే.. పదకొండో జట్టులా వరుణుడు ఆడుకుంటున్న విషయం తెలిసిందే. ప్రారంభంలో వరుసగా వర్షాలు

కురిసి మ్యాచ్ లకు అంతరాయం కలిగింది. కొన్ని మ్యాచ్లు పూర్తిగా రాద్దాయిపోయాయి కూడా. ఈ క్రమంలోనే న్యూజిలాండ్ తో ఇండియా లీగ్ దశలో

తలపడలేదు. తరువాత వరుణుడి టీం పక్కకి జరగడంతో టోర్నీ సవ్యంగా నడిచింది. ఇపుడు మళ్ళీ కప్ కథ క్లైమాక్స్ కు వస్తున్న దశలో వాతారణం

మారుతోంది. సెమీ ఫైనల్స్ మ్యాచ్ లకు వర్షం ముప్పు తప్పదంటున్నారు అక్కడి వాతావరణ నిపుణులు. అయితే, సెమీ ఫైనల్స్ కు రిజర్వు డే ఉండడంతో

మ్యాచ్ రద్దయ్యే పరస్థితి రాకపోవచ్చని అందరూ భావించారు. కానీ మొదటి సెమీ ఫైనల్ కు వాన అడ్డు పడ్డా అంత ఎక్కువ ఇబ్బంది ఉండదనీ, జల్లులే

కురిసిపోతాయనీ చెబుతున్నారు. అయితే, రెండో సెమీస్ జరగవలసిన గురువారం, రిజర్వు డే శుక్రవారం మాత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని

వాతావరణ శాఖ నివేదిక ఇచ్చింది. దీంతో ఇంగ్లాండ్ కప్ ఆశలపై వాన కురిసినట్టయింది. ఎందుకంటే, వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే, లీగ్ దశలోని పాయింట్ల

ఆధారంగా విజేతను నిర్ణయిస్తారు. అయితే, లీగ్ దశలో ఆసీస్ కంటే ఇంగ్లాండ్ పాయింట్లు తక్కువ. అందుచేత ఆస్ట్రేలియా నేరుగా ఫైనల్ కి వెళ్ళిపోతుంది.

ఇదిలా ఉంటె ఒకవేళ మొదటి సెమీస్ జరగకపోయినా ఇదే పరిస్థితి ఉంటుంది. పాయింట్ల ఆధారంగా ఇండియా ఫైనల్ చేరుకుంటుంది. ఏదేమైనా సినిమాలో

విలన్ ప్రీ క్లైమాక్స్ లో విజ్రుమ్భించినట్టు..వరుణుడు వరల్డ్ కప్ సెమీస్ పై తన ప్రతాపాన్ని చూపించేలా ఉన్నాడు.

వరల్డ్ కప్ రూల్స్ ఇవీ..

- సెమీస్‌ లేదా ఫైనల్‌ మ్యాచ్‌ల్లో స్కోర్లు టై అయితే సూపర్‌ ఓవర్‌ ద్వారా విజేతను నిర్ణయిస్తారు.

- రెండు సెమీఫైనల్స్‌, ఫైనల్‌ మ్యాచ్‌లకు రిజర్వ్‌డే ఉంటుంది. రిజర్వ్‌డే రోజుకూడా మ్యాచ్‌ జరగకపోతే లీగ్‌ దశలో ఏ జట్టు అత్యధిక పాయింట్లతో ఉంటుందో ఆ

జట్టే ఫైనల్‌కు చేరుతుంది.

- ఫైనల్‌ మ్యాచ్‌ నిర్వహణ రిజర్వ్‌డే రోజు కూడా సాధ్యపడక రద్దయితే ఇరు జట్లనూ సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories