ఇంగ్లాండ్ ఘనవిజయం

ఇంగ్లాండ్ ఘనవిజయం
x
Highlights

ఏ దశలోనూ లక్ష్యాన్ని చేరుకునే సూచనలు.. కనీసం లక్ష్యం వైపు వెళ్లే ప్రయత్నాలు చేయలేదు బంగ్లాదేశ్. ప్రత్యర్థి 386 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడిన వేళ.. ఆ...

ఏ దశలోనూ లక్ష్యాన్ని చేరుకునే సూచనలు.. కనీసం లక్ష్యం వైపు వెళ్లే ప్రయత్నాలు చేయలేదు బంగ్లాదేశ్. ప్రత్యర్థి 386 పరుగుల భారీ ఇన్నింగ్స్ ఆడిన వేళ.. ఆ స్కోరును దాటే అవకాశం తమకు లేదని ముందే అనుకున్నారేమో.. బ్యాటింగ్ ప్రాక్ట్స్ చేస్తున్నట్టుగా ఆడుకున్నారు. ఎన్ని పరుగుల అంతరాన్ని తగ్గించగలం అనేలా తమ ఇన్నింగ్స్ మొత్తం ఆడారు బంగ్లా బ్యాట్స్ మెన్. షకీబ్ అల హాసన్ అద్భుతంగా చేసిన సెంచరీ బంగ్లాదేశ్ జట్టుకు గౌరవ ప్రదమైన ఓటమిని అందించింది. లేకుంటే పరిస్థితి మరీ దారుణంగా ఉండేది.

టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు బంగ్లాదేశ్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. బ్యాటుతో విరుచుకుపడ్డారు. దొరికిన బెంచిని దొరికినట్టు బాదేశారు. ఆ జట్టు స్టార్‌ ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగుతూ.. బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించాడు. తాజా ప్రపంచకప్‌లో జేసన్‌ రాయ్‌(153;121 బంతుల్లో 14ఫోర్లు, 5 సిక్సర్లు) భారీ శతకం సాధించాడు. తొలుత జేసన్‌ రాయ్‌ (153 ), బెయిర్‌ స్టో (51), తరువాత బట్లర్‌ (64 ), మోర్గాన్‌(35 ) ల బాదుడుతో ఆరు వికెట్ల నష్టానికి 386 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ దూకుడు చూస్తే 400 పరుగులు దాటేటట్టు కనిపించింది కానీ, చివరి ఐదు ఓవర్లలో బంగ్లా బౌలర్లు ఇంగ్లాండ్ ను కట్టడి చేయగలిగారు

తరువాత బ్యాటింగ్ కు వచ్చిన బంగ్లాదేశ్ ఇంగ్లాండ్ ఇచ్చిన భారీ లక్ష్యం 387 పరుగులను ఛేదించే క్రమంలో ఆదిలోనే వికెట్ కోల్పోయింది . నాలుగో ఓవర్‌ రెండో బంతికి ఓపెనర్ సౌమ్య సర్కార్‌(2; 8బంతుల్లో) ఆర్చర్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. తరువాత క్రీజులోకి వచ్చిన షకిబ్‌ ఉల్‌ హసన్‌, మరో ఓపెనర్ ఇక్బల్ తో కల్సి నిదానంగా బ్యాటింగ్ చేశాడు. స్కోరు బోర్డును కదిలించాడు. పది ఓవర్లకి బంగ్లా బ్యాట్స్‌మెన్‌ నిలదొక్కుకుంటున్నారు. బౌండరీలు రాకున్నా సింగిల్స్‌ రూపంలో స్కోరుబోర్డును నడిపించారు. ఈ దశలో తమీమ్‌(19; 29బంతుల్లో ) పెవిలియన్‌కు చేరుకున్నాడు. 12ఓవర్‌ చివరి బంతికి తమీమ్‌ మోర్గాన్‌ చేతికి చిక్కాడు. పద్దెనిమిదో ఓవర్ వచ్చేసరికి ఓవర్‌కో బౌండరీ వస్తున్నా.. పరుగుల వేగం మాత్రం ఆశించినంతగా లేదు. మరోవైపు కావాల్సిన రన్‌రేట్‌ కూడా పెరుగుతోంది. షకిబ్‌(46) అర్దశతకం దిశగా అడుగులు వేస్తున్నా షాట్లకు మాత్రం ప్రయత్నించడం లేదు. దీంతో ఇక బంగ్లా ఓటమికి బీజం పడిపోయింది. 20 వ ఓవర్ వచ్చేసరికి షకిబ్‌ అర్థశతకం పూర్తయింది. అనంతరం అతను వేగం పెంచాడు. ఈ ఓవర్‌లో తొలి బంతికే బౌండరీ బాదాడు. మరోవైపు రహీమ్‌(19) కూడా కుదురుకున్నాడు. మొత్తంగా 20ఓవర్లకి బంగ్లా 105 పరుగులు చేసి వంద మార్కును దాటింది. 25 వ ఓవరకల్లా సాధించాల్సిన రన్‌రేట్‌ భారీగానే ఉన్నా.. బంగ్లా బ్యాట్స్‌మెన్‌ పోరాదారు. షకిబ్(79)కి తోడుగా రహీమ్‌(29) బ్యాట్‌ ఝళిపించాడు. అప్పటికి ఈ జోడీ 75పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఏదన్న అద్భుతం జరుగుతుందేమో అనుకున్న తరుణంలో షకిబ్‌కి అండగా నిలిచిన రహీమ్‌(44; 50బంతుల్లో) పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో వీరి 106పరుగుల భాగస్వామ్యానికి తెరపడినట్లయింది. 29ఓవర్‌ చివరి బంతికి షాట్ ఆడిన రహీమ్‌ రాయ్‌ చేతికి చిక్కాడు వెంటనే, బంగ్లాదేశ్‌ మహ్మాద్‌(0) వికెట్‌ చేజార్చుకుంది. రషీద్‌ వేసిన బంతిని ఆడిన మహ్మాద్‌ వికెట్‌కీపర్‌ బెయిర్‌స్టో చేతికి చిక్కాడు. 32.3వ బంతికి సింగిల్‌ తీసి 95 బంతుల్లోనే షకిబ్‌ అల్‌ హసన్‌ అద్భుత శతకం సాధించాడు. వన్‌డౌన్‌ బ్యాట్స్‌మెన్‌గా బరిలోకి దిగిన షకిబ్‌ అల్‌ హసన్‌ గొప్ప పట్టుదలతో ఇంగ్లాండ్‌ బౌలర్లను ఎదుర్కొంటూ స్కోరుబోర్డను నడిపించాడు. 119బంతుల్లో 121 పరుగుల ఇన్నింగ్స్ కి స్టోక్స్‌ తెర దించాడు. ఇక దీనితో బంగ్లా జట్టు ఏ మాత్రం విజయం సాధించే పరిస్థితి కనిపించలేదు; చివరికి 106 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ భారీ ఓటమి చవిచూసింది. 49ఓవర్‌ ఐదో బంతికి చివరి వికెట్‌గా ముస్తాఫిజుర్(0) ఆర్చర్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దీంతో బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ 280పరుగులకే పరిమితమైంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories