Top
logo

చివర్లో వికెట్లు.. భారత్ ముందు భారీ లక్ష్యం

చివర్లో వికెట్లు.. భారత్ ముందు భారీ లక్ష్యం
Highlights

మహ్మద్ షమీ మళ్ళీ మెరిశాడు. నాలుగొందల పరుగులు స్కోరు చేసేంత ఊపులో ఉన్న ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ ను తన మేజిక్ తో...

మహ్మద్ షమీ మళ్ళీ మెరిశాడు. నాలుగొందల పరుగులు స్కోరు చేసేంత ఊపులో ఉన్న ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ ను తన మేజిక్ తో నిలువరించారు. తన మొదటి స్పెల్ లో మూడు ఓవర్లలో 23 పరుగులు ఇచ్చిన షమీ తరువాతి స్పెల్ లో రెచ్చిపోయాడు. నిప్పులు చెరిగిబంతులతో ఇంగ్లాండ్ ను కట్టడి చేశాడు. చివర్లో వరుసగా వికెట్లను తీశాడు. మొత్తమ్మీద మ్యాచ్ లో 5 వికెట్లు తీసి తానెంత విలువైన బౌలరో టీమిండియాకు చాటి చెప్పాడు. మరో పక్క బుమ్రా పొదుపుగా బౌలింగ్ చేసినప్పటికీ.. చివరి ఓవర్లో మాత్రమే ఓ వికెట్ సాధించగలిగాడు. చాహల్, పాండ్య, కుల్దీప్ ఇంగ్లాన్డ్ బ్యాట్స్ మెన్ పై ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. దీనితో నిర్ణీత 50 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లాండ్ జట్టు ఏడూ వికెట్లు కోల్పోయి 337 పరుగులు చేసింది. టీమిండియా ముందు 338 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.

ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ లో రాయ్ 66 పరుగులు, బెయిర్ స్టో 111 పరుగులు, రూట్ 44 పరుగులూ, స్టోక్స్ 79 పరుగులూ బట్లర్ 20 పరుగులూ చేసి భారీ స్కోరుకు కారణమయ్యారు.


Next Story

లైవ్ టీవి


Share it