ధోనీ ఎక్కడున్నా..

ధోనీ ఎక్కడున్నా..
x
Highlights

ప్రపంచ క్రికెట్ లో ధోనీ క్రేజ్ వేరు. ఎక్కడైనా.. ఏ దేశంలోనైనా ధోనీ కనిపిస్తే చాలు అభిమానులు ఊగిపోతారు. ప్రపంచ కప్ కోసం ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ లో...

ప్రపంచ క్రికెట్ లో ధోనీ క్రేజ్ వేరు. ఎక్కడైనా.. ఏ దేశంలోనైనా ధోనీ కనిపిస్తే చాలు అభిమానులు ఊగిపోతారు. ప్రపంచ కప్ కోసం ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ లో ఉంది. శనివారం మొదిటి వార్మప్ మ్యాచ్ ఆడింది. న్యూజిలాండ్ తో జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ పరాజయం పాలైంది. అయితే ఇది ఏమంత కంగారు పడాల్సిన విషయం కాదు. అక్కడి పరిస్థితులకు అలవాటు పడటానికి సమయం పడుతుంది కాబట్టి లైట్ గా తీసుకోవచ్చు. ఈ మ్యాచ్ లో భరత్ కీపర్ గా దినేష్ కార్తీక్ వ్యవహరించాడు. ధోనీ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేశాడు. ఇక ఆ సమయంలో అక్కడ ధోనీ..ధోనీ అంటూ స్టేడియం మోత మోగిపోయింది. ధోనీని బౌండరీ లైన్‌ దగ్గర చూడగానే స్టేడియంలో ఉన్న కొందరు లేచి 'ధోనీ..ధోనీ..' కేరింతలు కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఆంగ్ల గడ్డ మీద కూడా ధోనీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories