ధోనీ కీపింగ్ లో చురుకుతనం తగ్గిందా?

ధోనీ కీపింగ్ లో చురుకుతనం తగ్గిందా?
x
Highlights

మహేంద్ర సింగ్ ధోనీ.. ఈ పేరు టీమిండియాకు విజయ మంత్రం. టీములో ధోనీ ఉంటే చాలు సగం విజయం సాధించినట్టే అనుకుంటారు అభిమానులు. అటువంటి ధోనీ ఈ వరల్డ్ కప్ లో...

మహేంద్ర సింగ్ ధోనీ.. ఈ పేరు టీమిండియాకు విజయ మంత్రం. టీములో ధోనీ ఉంటే చాలు సగం విజయం సాధించినట్టే అనుకుంటారు అభిమానులు. అటువంటి ధోనీ ఈ వరల్డ్ కప్ లో బ్యాటింగ్ లో స్లో బ్యాటింగ్ చేస్తూ విమర్శలు ఎదుర్కుంటున్నాడు. ధనా ధన్ ధోనీని చూసి ఎంతకాలమైందో అని అందరూ దిగులు పడేలా చేస్తున్నాడు. అయితే, ఒక్క బ్యాటింగ్ లోనే కాదు ఈ వరల్డ్ కప్ లో కీపింగ్ లోనూ ధోనీ తడబడుతున్నాడంటున్నాయి గణాంకాలు. వికెట్ల వెనక ధోనీ ఉంటె ఏ బ్యాట్స్ మెన్ కూడా కాలు కడపాలంటే భయపడతాడు. క్రీజు వంక చూసుకుంటూ జాగ్రత్త పడతారు. అయితే, ఈ టోర్నీలో ధోనీ కీపింగ్ లో చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఈ మెగాటోర్నీలో 9 మ్యాచ్‌లు ఆడిన ధోని ఏకంగా బైస్‌ రూపంలో 24 పరుగులు ఇచ్చాడు. టోర్నీ మొత్తం బైస్‌ రూపంలో 71 పరుగులే రాగా.. ధోని ఒక్కడే 24 పరుగులు ఇవ్వడం అతని కీపింగ్‌ లోపాన్ని తెలియజేస్తుంది. ఇక ధోని తర్వాత ఆస్ట్రేలియా వికెట్‌ కీపర్‌ అలెక్స్‌ క్యారీ 9 పరుగులు సమర్పించుకున్నాడు. మొత్తం టోర్నీలో క్యారీ 17 ఔట్లతో వికెట్‌ కీపర్‌ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా..9 ఔట్లతో ధోని 9 స్థానంలో ఉన్నాడు.

ఇక శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో మాత్రం నాలుగు ఔట్లలో భాగస్వామి అయ్యాడు. వరల్డ్ కప్ లో ఓకే మ్యాచ్ లో ఈ ఘనత అందుకున్న మూడో కీపర్ గా గుర్తింపు పొందాడు. ధోనీ కన్నా ముందు ఐదు ఓట్లలో భాగం పంచుకున్న కీపర్స్ గా నయాన్ మోంగియా, సయ్యద్ కిర్మాణి ఉన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories