ధావన్ మొదలెట్టాడు..

ధావన్ మొదలెట్టాడు..
x
Highlights

ఆస్ట్రేలియా తో టీమిండియా మ్యాచ్ ఇపుడిపుడే వేడెక్కుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా కు ఓపెనర్లు నిదానంగా ఆడుతూ మంచి ప్రారంభాన్ని ఇచ్చారు....

ఆస్ట్రేలియా తో టీమిండియా మ్యాచ్ ఇపుడిపుడే వేడెక్కుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా కు ఓపెనర్లు నిదానంగా ఆడుతూ మంచి ప్రారంభాన్ని ఇచ్చారు. ఆస్ట్రేలియా బౌలర్లు మంచి బంతులతో రోహిత్, ధావన్ లను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. కానీ, తమ నిలకడైన ఆటతో వారికి ఎటువంటి చాన్సు ఇవ్వలేదు భారత ఓపెనర్లు. ఇన్నింగ్స్ ఏడో ఓవర్ నైల్ వేశాడు. ఈ ఓవర్లో ధావన్ 14 పరుగులు చేసి గేరు మార్చాడు. మరో పక్క రోహిత్ తన శైలిలో నిదానంగా ఆడుతున్నాడు. పది ఓవర్లు ముగిసే సరికి టీమిండియా వికెట్ కోల్పోకుండా 41 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 11 (25) ధావన్ 27 (35) పరుగులతోనూ క్రీజ్ లో ఉన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories