ధావన్ సెంచరీ!

ధావన్ సెంచరీ!
x
Highlights

ఆస్ట్రేలియా తో జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్ లో భాగంగా భారత్ వేగంగా పరుగులు చేస్తోంది. టీమిండియా ఒపెనర్లిద్దరూ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్...

ఆస్ట్రేలియా తో జరుగుతున్న వరల్డ్ కప్ మ్యాచ్ లో భాగంగా భారత్ వేగంగా పరుగులు చేస్తోంది. టీమిండియా ఒపెనర్లిద్దరూ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్ కు శుభారంభాన్నిచ్చారు. రోహిత్ అవుట్ కావడంతో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీ అండ తో శిఖర్ ధావన్ సెంచరీ సాధించాడు. స్టోయినిస్‌ వేసిన ఇన్నింగ్స్ ౩౩ వ ఓవర్లో ధావన్ 95 బంతుల్లో 100 పరుగులు చేశాడు.

28వ ఓవర్లో మ్యాక్స్‌వెల్‌ కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. దీంతో ఆ ఓవర్లో 4 పరుగులే వచ్చాయి. తరువాతి ఓవర్లో (కమిన్స్) ధావన్ బౌండరీ బాదడం తో ఏడు పరుగులు వచ్చాయి. 30 ఓవర్లో మళ్లీ ధావన్ బౌండరీ కొట్టాడు. దీంతో ఆ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. ధావన్ సెంచరీ కి నాలుగు పరుగుల దూరం లో ఉన్నాడు. విరాట్ కోహ్లీ అతనికి చక్కని సహాకారం అందిస్తున్నాడు. 31 ఓవర్లో 8 పరుగులు వచ్చాయి.

ప్రస్తుతం భారత్ స్కోరు ౩౩ ఓవర్లకు 190 పరుగులు. కోహ్లీ 28 (32) పరుగులతోనూ, ధావన్ 100 (96) పరుగులతోనూ క్రీజులో ఉన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories