చితక్కొట్టిన ధవన్.. కోల్‌కతాపై ఢిల్లీ ఘన విజయం

చితక్కొట్టిన ధవన్.. కోల్‌కతాపై ఢిల్లీ ఘన విజయం
x
Highlights

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. ఢిల్లీ...

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఓపెనర్ ధవన్ చెలరేగి ఆడి.. తమ జట్టుకు ఈ అద్భుత విజయాన్ని అందించాడు. శుక్రవారం జరిగిన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌ 7 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌పై ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన నైట్‌రైడర్స్‌ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 178 పరుగులు చేసింది. శుబ్‌మన్‌ గిల్‌ (39 బంతుల్లో 65; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధిం చాడు. రసెల్‌ (21 బంతుల్లో 45; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) ధాటిగా ఆడాడు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 18.5 ఓవర్లలో 3 వికెట్లకు 180 పరుగులు చేసి గెలిచింది.'మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' శిఖర్‌ ధావన్‌ (63 బంతుల్లో 97 నాటౌట్‌; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories