Top
logo

కపిల్‌దేవ్‌ను దాటేసిన డెయిల్ స్టెయిన్‌

కపిల్‌దేవ్‌ను దాటేసిన డెయిల్ స్టెయిన్‌
X
Highlights

టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల వరుసలో సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్, వైట్ లైట్నింగ్ డేల్...

టెస్ట్ క్రికెట్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ల వరుసలో సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్, వైట్ లైట్నింగ్ డేల్ స్టెయిన్ ఏడో స్థానం సాధించాడు. డర్బన్ కింగ్స్ మీడ్ వేదికగా శ్రీలంకతో జరుగుతున్న తొలిటెస్ట్ తొలిఇన్నింగ్స్ లో 48 పరుగులకే 4 వికెట్లు పడగొట్టడం ద్వారా స్టెయిన్ తన వికెట్ల సంఖ్యను 437 కు పెంచుకొన్నాడు. భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ పేరుతో ఉన్న 434 వికెట్ల రికార్డును అధిగమించాడు. తన కెరియర్ లో 92వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న స్టెయిన్ ప్రస్తుత డర్బన్ టెస్ట్ కు ముందు వరకూ ఆడిన 91 టెస్టుల్లో 433 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 26 సార్లు 5 వికెట్లు, ఐదుసార్లు 10 వికెట్లు పడగొట్టిన రికార్డులను సైతం సొంతం చేసుకొన్నాడు.

ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ పేరుతో ఉన్న 437 వికెట్ల రికార్డును సమం చేసిన స్టెయిన్ ఓవరాల్ జాబితాలో 7వ స్థానం సాధించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యధికంగా 800 వికెట్లతో శ్రీలంక ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బౌలర్ నంబర్ వన్ గా నిలిస్తే కంగారూ జాదూ స్పిన్నర్ షేన్ వార్న్ 708 వికెట్లతో రెండు, 619 వికెట్లతో అనీల్ కుంబ్లే మూడు, 575 వికెట్లతో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ యాండర్సన్ నాలుగు, 563 వికెట్లతో గ్లెన్ మెక్ గ్రాత్ ఐదు, 516 వికెట్లతో కోట్నీ వాల్ష్ ఆరు స్థానాలలో నిలిస్తే స్టువర్ట్ బ్రాడ్ , స్టెయిన్ మాత్రం చెరో 437 వికెట్లతో సంయుక్తంగా ఏడోస్థానంలో కొనసాగుతున్నారు.

Next Story