భారీస్కోరుపై కన్నేసిన ఆస్ట్రేలియా..హాఫ్ సెంచరీ కొట్టి పెవిలియన్ చేరిన ఫించ్

భారీస్కోరుపై కన్నేసిన ఆస్ట్రేలియా..హాఫ్ సెంచరీ కొట్టి పెవిలియన్ చేరిన ఫించ్
x
Highlights

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌లో నేడు నాటింగ్ హామ్ లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య పోరు నడుస్తోంది. టాస్ గెలిచిన...

ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌లో నేడు నాటింగ్ హామ్ లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య పోరు నడుస్తోంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, కెప్టెన్ ఆరోన్ ఫించ్ ప్రత్యర్థులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా బంతులను ఉరికిస్తున్నారు. ముందుగా వార్నర్ హాఫ్ సెంచరీ చేయగా 20 వ ఓవర్‌లో ఫించ్ 50 పరుగులు చేశాడు. అయితే సౌమ్య సర్కార్ బౌలింగ్ లో ఫించ్ ఔట్ అయి పెవిలియన్ బాట పట్టాడు. రుబెల్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో క్రీజులోకి ఉస్మాన్ ఖవాజా వచ్చాడు. అయితే మొత్తం 51 బంతుల్లో ఫించ్ 53 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. ఇక మరోవైపు డేవిడ్ వార్నర్ శతకం దిశగా దూసుకెళ్తున్నాడు. 85 బంతుల్లో 69 పరుగులు చేశాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories