ప్రపంచ కప్ పండగకు 15 రోజులు..

ప్రపంచ కప్ పండగకు 15 రోజులు..
x
Highlights

సరిగ్గా పదిహేను రోజులు.. మొన్నటి వరకూ ఐపీఎల్ లో మునిగి తేలిన క్రికెట్ ప్రేమికులకు మరో పెద్ద పండగ ప్రారంభం కాబోతోంది. క్రికెట్ పుట్టిల్లుగా చెప్పే...



సరిగ్గా పదిహేను రోజులు.. మొన్నటి వరకూ ఐపీఎల్ లో మునిగి తేలిన క్రికెట్ ప్రేమికులకు మరో పెద్ద పండగ ప్రారంభం కాబోతోంది. క్రికెట్ పుట్టిల్లుగా చెప్పే ఇంగ్లాండ్ ఈ ప్రపంచ కప్ కు ఆతిధ్యం ఇస్తోంది. 30 రోజులు.. 11 మైదానాలు.. 10 దేశాలు.. 48 మ్యాచులు.. సింపుల్ గా చెప్పాలంటే ఇంతే. వేసవి వేడి చల్లబడుతుండగానే ఈ క్రికెట్ వేడి ప్రారంభం అయిపోతుంది.

ఐపీఎల్ సందడిలో దాదాపుగా అన్ని దేశాలు పూర్తి స్థాయిలో ప్రపంచ కప్ పై దృష్టి సారించలేదు. ఇక ఇపుడు కౌంట్ డౌన్ ప్రారంభం అయింది. రెండు వారాల్లో ఇంకా చెప్పాలంటే సరిగ్గా 9 రోజుల్లోపు అన్ని జట్లు ఇంగ్లాండ్ చేరిపోవాలి. ఈ లోపులోనే తమ సన్నాహకాలు చేసుకోవాలి. కొన్ని దేశాలు తమకు అందుబాటులో ఉన్న క్రికెటర్లతో సన్నాహక మ్యాచులు నిర్వహించాయి. వారిని సన్నద్ధులను చేశాయి. కానీ, ఐపీఎల్ లో ఆడిన క్రికెటర్లకు మాత్రం ఐపీఎల్ లో ఆడిన ఆటే ప్రపంచకప్ కోసం సాధనగా మారింది. ప్రతిష్టాత్మకంగా భావించే.. వన్డే క్రికెట్ లో ఎవరు కింగ్ లో తేల్చే వరల్డ్ కప్ లో తలపడే జట్ల పై ఆయా దేశాల్లో క్రికెట్ అభిమానుల్లో పెద్ద అంచనాలే ఉన్నాయి. అన్ని టీములు కప్పు కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తాయండం లో సందేహం లేదు. ఎపుడైనా ఏమైనా జరగొచ్చు. హాట్ ఫేవరేట్ గా దిగిన జట్టు లీగ్ దశలోనే చతికల పడొచ్చు. ఆపసోపాలు పడి ప్రపంచ కప్ లో స్థానం సాధించిన అతి చిన్న జట్టు పెను సంచలనాలు సృష్టించొచ్చు. వన్డే లో.. సరిగ్గా చెప్పాలంటే వంద ఓవర్లలో ఒక్క ఓవర్.. లేదా ఒక్క బంతి మ్యాచు గతినే తిప్పేయొచ్చు. టీ 20లా మెరుపు వేగంతో సాగదు వన్డే మ్యాచు. ప్రతి ఓవర్ కు వ్యూహాన్ని మార్చుకుని నిలకడైన ప్రదర్శన చేస్తేనే ఛాంపియన్ గా నిలబడుతుంది ఏ టీమ్ అయినా.


1983లో పసికూనల్లా దిగిన భారత్ జట్టు కప్ ఎగరేసుకుని వచ్చి క్రికెట్ ప్రపంచాన్నే శాసించగలిగిన పెద్ద పులిలా మారిపోయింది. ఆ ఏముందిలే అనుకున్న శ్రీలంక జట్టు ఒక్క మంచి ప్రదర్శనతో 1996లో కప్ గెలిచి సంచలనం సృష్టించింది. నాలుగేళ్లకు ఓసారి వచ్చే ఈ టోర్నీలో 1975 నుంచి ఇప్పటి వరకూ ఆస్ట్రేలియా 5 సార్లు, వెస్టిండీస్ 2 సార్లు, భారత్ 2 సార్లు, పాకిస్థాన్ శ్రీలంక చెరోసారి కప్ ను సాధించాయి. ఈ లెక్కన చూస్తే ఆస్ట్రేలియా ఎపుడూ హాట్ ఫేవరేట్ కిందే లెక్క. అలా అని ఆ జట్టు అంత దుర్భేద్యమైనదేం కాదు. ఈ ప్రపంచ కప్ లో అందరూ అందరే.. గత లెక్కలు ఎపుడూ వన్డే క్రికెట్ లో పనిచేయవు. ఈసారీ అంతే అవుతుందా అనేది 45 రోజుల్లో తేలుతుంది. ఈలోపు అన్ని మ్యాచులూ క్రికెట్ ప్రేమికులకు పూర్తి పసందును అందిస్తాయండం లో సందేహం లేదు. సరిగ్గా 15 రోజులు.. లెక్కేసుకోండి.. అభిమానులారా.. మీ కోసం పసందైన క్రికెట్ క్రీడా వినోదం సిద్ధం అవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories