మట్టికోర్టులపై మకుటంలేని మహరాజు

మట్టికోర్టులపై మకుటంలేని మహరాజు
x
Highlights

గెలవడం అలవాటుగా మారిపోతుంది కొందరికి. విజయం అనే పదమే దాసోహంగా మారిపోతుంది అటువంటి వారి తపనకు. ఇష్టపడటం.. కష్టపడటం.. పోరాడటం.. లక్ష్యాన్ని చేరుకోవడం.....

గెలవడం అలవాటుగా మారిపోతుంది కొందరికి. విజయం అనే పదమే దాసోహంగా మారిపోతుంది అటువంటి వారి తపనకు. ఇష్టపడటం.. కష్టపడటం.. పోరాడటం.. లక్ష్యాన్ని చేరుకోవడం.. ఇదే వారికి జీవన పయనం గా మారిపోతుంది. సరిగ్గా అలాంటి పోరాట యోధుడే రాఫెల్ నాదల్.

33 ఏళ్ల ఈ స్పానిష్ టెన్నిస్ క్రీడాకారుడు సంచలనాలకు మారుపేరుగా నిలిచాడు. ప్రస్తుతం ప్రపంచ నెం 2 గా ఉన్న నాదల్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ను 12 వ సారి గెలిచి రికార్డ్ సృష్టించాడు. ఈ పన్నెండు సార్లలో 2005 నుంచి 2008 వరకూ ఒకసారి, 2010 నుంచి 2014 వరకూ ఒకసారి మళ్లీ 2017 నుంచి 2019 వరకూ ఒకసారి వరుసగా టైటిల్ సొంతం చేసుకున్నాడు. అంటే.. తాను మొదటి టైటిల్ గెలిచిన 2005 నుంచి ఇప్పటి వరకూ 15 సంవత్సరాల్లో మూడంటే మూడు సార్లు మాత్రమే టైటిల్ గెలవలేకపోయాడు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు నాదల్ ఎర్రమట్టి కోర్టుల్లో ఎలా రెచ్చిపోతాడో. నాదల్ టెన్నిస్ గ్రాండ్ స్లామ్ సింగిల్స్ లో మొత్తం 19 టైటిల్స్ గెలిచాడు. అందులో 12 టైటిల్స్ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్సే. (యుఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, ఆస్ట్రేలియా ఓపెన్, వింబుల్డన్ వీటిని టెన్నిస్ లో గ్రాండ్ స్లామ్ టోర్నీలుగా పేర్కొంటారు.)

ఇక ఇతర టోర్నమెంట్ ల విషయానికి వస్తే బార్సిలోనా ఓపెన్ టోర్నీ ని పదకొండు సార్లు, మోంటే-కార్లో మాస్టర్స్ టైటిల్ ని 11 సార్లు గెలిచాడీ టెన్నిస్ యోధుడు. అంతే కాకుండా ఇటాలియన్ ఓపెన్ టైటిల్ నూ 9 సార్లు తన ఖాతాలోనే వేసుకున్నాడు రఫెల్ నాదల్.


స్పెయిన్ లోని మల్లోర్కా లో జూన్ 3, 1986 లో పుట్టాడు రావెల నాదల్ పెరెరా. రఫెల్ నాదాల్ గా టెన్నిస్ ప్రపంచయాన్ని ఏలుతున్నాడిప్పుడు. నాదల్ తన చిన్నాన్న టోనీ నాదల్ మార్గదర్శనంలో తన నాలుగు సంవత్సరాల వయసులోనే రాకెట్ పట్టుకున్నాడు. 2001 లో ప్రొఫెషనల్ క్రీడాకారుడిగా అధికారికంగా ప్రకటితమయ్యాడు. వెంటనే జరిగిన వింబుల్డన్ 2002 టోర్నమెంట్ లో (తన మొదటి) సెమీఫైనల్ కు చేరుకొని సంచలనం సృష్టించాడు. తరువాతి సంవత్సరంలోనే టాప్ 50 లో చోటు సంపాదించుకున్నాడు. 2004 లో జరిగిన డేవిస్ కప్ టోర్నీలో స్పెయిన్ ఫైనల్స్ లో అమెరికా మీద విజయాన్ని సాధించింది. అపుడు స్పెయిన్ జట్టులో నాదల్ ఆటతీరు ఆ విజయనానికి మూలస్తంభంలా నిలిచింది. 2005 లో ఫ్రెంచ్ ఓపెన్ టోర్నమెంట్లో పదకొండు విజయాలు సాధించడం ద్వారా రికార్డు సృష్టించాడు. ఈ టోర్నీలో నాదల్ రోజర్ ఫెదరర్ ను మొదటి సారిగా సెమీఫైనల్స్ లో ఓడించాడు. అప్పటి నుంచీ ఫెదరర్-నాదల్ మధ్య ఆధిపత్య పోరు సాగుతూనే వస్తోంది. అయితే, మొదట్నుంచీ.. పచ్చిక కోర్టుల కన్నా.. మట్టికోర్టుల్లోనే నాదల్ విజయాపరంపర కొనసాగింది. 2007 లో మట్టి కోర్టుల్లోనే 81 మ్యాచుల్లో వరుసగా విజయాల్ని సాధించి సంచలనం సృష్టించాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా కాలే కోర్టుల్లో నాదల్ కు తిరుగులేదు. 2008 లో ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్ లో ఫెదరర్ పై గెలిచి బోర్గ్ పేరిట ఉన్న వరుస నాలుగు టోర్నీల విజయాల రికార్డును సమం చేశాడు. 2008 లోనే ఫెదరర్ పై వింబుల్డన్ ఫైనల్స్ లో విజయం సాధించాడు. ఏ మ్యాచ్ ఇప్పటికీ ప్రపంచ రికార్డే. ఎందుకంటే.. 4 గంటల 48 నిమిషాల పాటు సుదీర్ఘంగా సాగిన ఏకైక టెన్నిస్ మ్యాచ్ ఇదే. ఇక 2008 లోనే ఒలింపిక్స్ లో పురుషుల సింగిల్స్ టెన్నిస్ లో స్వర్ణ పతాకాన్ని సొంతం చేసుకున్నాడు. 2009 లో మొదటిసారి ఆస్ట్రేలియా ఓపెన్ టోర్నీ ని గెలుచుకున్నాడు నాదల్. అలా మొదలైన నాదల్ విజయప్రస్థానం 2014 వరకూ కొనసాగింది. అయితే, ఆ సంవత్సరంలో గాయాలతో గ్రాండ్స్లారం టోర్నమెంట్ లన్నిటికీ దూరమయ్యాడు. దాంతో తరువాతి సంవత్సరం ఫామ్ కోల్పోయి ఒక్క టైటిల్ నూ గెలవలేకపోయాడు. 2016 ఒలింపిక్స్ లో రెండో గోల్డ్ మెడల్ సాధించి గోడకు కొట్టిన బంతిలా తిరిగి టెన్నిస్ ప్రపంచంలోకి దూసుకువచ్చాడు. ఇక తరువాత వరుసగా ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీని తన ఖాతాలో వేసుకున్నాడు.



2019 జూన్ 9 న జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ ను గెలుచుకోవడం ద్వారా టెన్నిస్‌ చరిత్రలోనే ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఓ గ్రాండ్‌స్లామ్‌ టోర్నమెంట్‌ను రికార్డు స్థాయిలో 12వసారి సొంతం చేసుకున్న వాడిగా రికార్డు సృష్టించాడు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories