చేజింగ్ భారత్ కి సవాలేనా?

చేజింగ్ భారత్ కి సవాలేనా?
x
Highlights

ఫైనల్ లో ఇండియా ఉంటుంది .. ఏ దేశ క్రికెటర్ అడిగినా ఇదే మాట చెబుతున్నారు .. అందుకు తగ్గట్టే భారత్ కూడా అంచనాలను ఎక్కడ కూడా తగ్గించకుండా సెమిస్ కి...

ఫైనల్ లో ఇండియా ఉంటుంది .. ఏ దేశ క్రికెటర్ అడిగినా ఇదే మాట చెబుతున్నారు .. అందుకు తగ్గట్టే భారత్ కూడా అంచనాలను ఎక్కడ కూడా తగ్గించకుండా సెమిస్ కి చేరారు .. కానీ ఫైనల్ లో మంచి విజయాన్ని సొంతం చేసుకొని ఫైనల్ లోకి అడుగు పెడదాం అనుకున్నా భారత్ కి వరుణుడు అడ్డుకట్ట వేసి మ్యాచ్ ని మరో రోజుకు ఎక్స్టెండ్ చేసాడు.. నిన్న ఆగిపోయినప్పడి నుండి మ్యాచ్ ఈరోజు రన్ అవుతుంది . ఒకవేళ మ్యాచ్ కి మళ్ళీ వర్షం అడ్డుపడితే భారత్ నేరుగా ఫైనల్ కి వెళ్తుంది .. ఒకవేళ రద్దు కాకుండా మ్యాచ్ ని పరిమిత ఓవర్లకు కుదిస్తే భారత్ కి చేజింగ్ అనేది కొంచం కష్టమే అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ..

వర్షం వల్ల పిచ్ బ్యాటింగ్ కి ప్రతికూలంగా మారే అవకాశం ఉంటుంది . ఫీల్డ్ కూడా చిత్తడిగా ఉండడంతో బాల్ బౌండరీ దాటాలి అంటే కష్టంగా మారుతుంది . ఇలాంటి పిచ్‌పై బౌల్ట్, ఫెర్గూసన్‌, హెన్రీ వంటి బౌల‌ర్లను ఎదురుకోవడం అనేది కొంచం కష్టంతో కూడుకున్న పనే అని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు .. ఇక‌ డ‌క్‌వ‌ర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం ఓవ‌ర్లను కుదిస్తే 46 ఓవర్లలో 237, 40 ఓవర్లలో 223, 35 ఓవర్లలో 209, 30 ఓవర్లలో 192, 25 ఓవర్లలో 172, 20 ఓవర్లలో 148 ప‌రుగులు చేయాల్సి ఉంటుంది .. మరి ఏం జరగబోతుందో చూడాలి ..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories