ఆరు వికెట్లు తీసిన చాహ‌ల్‌

ఆరు వికెట్లు తీసిన చాహ‌ల్‌
x
Highlights

టీమిండియా లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ మెల్బోర్న్ వన్డేలో ఓ అసాధారణ రికార్డు నమోదు చేశాడు. ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్ వేదికగా జరిగిన తీన్మార్ సిరీస్ లోని ఆఖరి వన్డేలో 42 పరుగులకే 6 వికెట్లు పడగొట్టి కంగారూజట్టును 230 పరుగులకే కుప్పకూల్చడంలో ప్రధానపాత్ర వహించాడు.

టీమిండియా లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ మెల్బోర్న్ వన్డేలో ఓ అసాధారణ రికార్డు నమోదు చేశాడు. ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్స్ వేదికగా జరిగిన తీన్మార్ సిరీస్ లోని ఆఖరి వన్డేలో 42 పరుగులకే 6 వికెట్లు పడగొట్టి కంగారూజట్టును 230 పరుగులకే కుప్పకూల్చడంలో ప్రధానపాత్ర వహించాడు. సిరీస్ లో తొలిసారిగా బరిలోకి దిగిన చాహల్ 10 ఓవర్లలో 42 పరుగులిచ్చి ఏకంగా ఆరు వికెట్లు సాధించాడు. వన్ డౌన్ క్వాజా, రెండో డౌన్ షాన్ మార్ష్, హ్యాండ్స్ కోంబ్, స్టోయినిస్, రిచర్డ్స్ సన్, జంపా చాహల్ బౌలింగ్ లో దొరికిపోయారు. మెల్బోర్న్ వేదికగా 2004 సిరీస్ లో అజిత్ అగార్కర్ సాధించిన 42 పరుగులకు 6 వికెట్ల రికార్డును చాహల్ సమం చేశాడు. మెల్బోర్న్ గ్రౌండ్స్ లో మిషెల్ స్టార్క్ 43 పరుగులిచ్చి 6 వికెట్లు, క్రిస్ వోక్స్ 45 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టిన రికార్డులు సైతం ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories