కోహ్లిని ఊరిస్తున్న రికార్డ్స్ ఇవే!

కోహ్లిని ఊరిస్తున్న రికార్డ్స్ ఇవే!
x
Highlights

గత న్యూజిలాండ్ పర్యటనలో భారత జట్టు ఘోరంగా ఓడిపోయినా సంగతి తెలిసిందే.. ఇక టీంఇండియా కెప్టెన్ కోహ్లి తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఒక్క మ్యాచ్ లో కూడా చేయలేదు. ఇక ఈ రోజు నుంచి దక్షిణాప్రికా జట్టుతో మూడు వన్డేల సిరీస్ మొదలుకానుంది.

గత న్యూజిలాండ్ పర్యటనలో భారత జట్టు ఘోరంగా ఓడిపోయినా సంగతి తెలిసిందే.. ఇక టీంఇండియా కెప్టెన్ కోహ్లి తన స్థాయికి తగ్గ ప్రదర్శన ఒక్క మ్యాచ్ లో కూడా చేయలేదు. ఇక ఈ రోజు నుంచి దక్షిణాప్రికా జట్టుతో మూడు వన్డేల సిరీస్ మొదలుకానుంది. ఇటు ఆటగాడిగా అటు కెప్టెన్ గా కోహ్లికి ఈ సిరీస్ కీలకం కానుంది. అంతేకాకుండా కోహ్లిని కొన్ని రికార్డ్లు ఉరిస్తున్నాయి. ఇప్పటివరకు భారత్‌-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన వన్డేల్లో మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. మొత్తం 57 మ్యాచ్‌ల్లో 2001 పరుగులు చేశాడు.

ఇక ఆ తర్వాతి స్థానంలో జాక్వెస్‌ కలిస్‌, గ్యారీ కిర్‌స్టెన్‌, ఏబీ డివిలియర్స్‌, సౌరభ్‌ గంగూలీ, రాహుల్‌ ద్రవిడ్‌ లు ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో కోహ్లి ఉన్నాడు. కోహ్లి మొత్తం 27 మ్యాచ్ లలో 1287 పరుగులు చేశాడు. ఇక ఈ సిరీస్ లో కనుక కోహ్లి మరో 249 పరుగులు చేస్తే కలీస్‌ను వెనక్కినెట్టి రెండో స్థానానికి చేరుకోవచ్చు.. ఇదే కాకుండా వన్డేల్లో అత్యంత వేగంగా 12 వేల పరుగుల మైలురాయిని చేరుకోడానికి కోహ్లి ఇంకా 133 పరుగుల దూరంలో నిలిచాడు. ఈ జాబితాలోనూ సచిన్‌ 300 ఇన్నింగ్స్‌లతో అగ్రస్థానంలో ఉండగా, రికీ పాంటింగ్‌ 314 ఇన్నింగ్స్‌ లతో రెండో స్థానంలో ఉన్నాడు.

ఈ రోజు మ్యాచ్ ;

దక్షిణాప్రికా, భారత్ జట్ల మధ్య ఈ రోజు ధర్మశాలలో మొదటి మ్యాచ్ జరగనుంది. అయితే ఇక్కడ పలుమార్లు వర్షం పడే అవకాశం ఉంది. మొదటగా టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ కి ఎక్కువగా మొగ్గు చూపుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ చేజింగ్ చేసిన జట్టునే గెలవడం విశేషం.. ఇక పిచ్‌ పేస్‌ బౌలర్లకు సహకరించే అవకాశం ఉంది. ఇక్కడ భారత్ ఇప్పటివరకు నాలుగు వన్డేలు ఆడితే రెండు నెగ్గి, రెండిటిలో ఓడింది. న్యూజిలాండ్ పర్యటనలో ఘోరంగా ఓడిన కోహ్లి సేన ఈ సిరీస్ పైన ద్రుష్టి సాధించింది. ఇక దక్షిణాప్రికా జట్టు ఇటివల ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్ లో గెలిచి మంచి జోరు మీదా ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories