ఇండియా టూర్ కి ముందే దక్షిణాప్రికాకు భారీ షాక్..

ఇండియా టూర్ కి ముందే దక్షిణాప్రికాకు భారీ షాక్..
x
Indida, South Africa (File Photo)
Highlights

చ్చే నెలలో మూడు వన్డేల సీరిస్ కోసం సఫారి జట్టు భారత్ లో పర్యటించనుంది. ఈ నేపధ్యంలో టూర్ కి ముందే ఆ జట్టుకి భారీ షాక్ తగిలింది.

వచ్చే నెలలో మూడు వన్డేల సీరిస్ కోసం సఫారి జట్టు భారత్ లో పర్యటించనుంది. ఈ నేపధ్యంలో టూర్ కి ముందే ఆ జట్టుకి భారీ షాక్ తగిలింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ కగిసో రబాడ గాయపడ్డాడు. ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన టీ20 సిరీస్‌లో ఆడుతూ కగిసో రబాడ గాయపడ్డాడు. తోడ కండరాల కారణంతో అతను నాలుగు వారాలు ఆటకు దూరం అయ్యాడు. ఈ విషయాన్ని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు వెల్లడించింది.

గాయం అనంతరం అతనికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు గాయం తీవ్రత దృష్ట్యా కనీసం నాలుగు వారాలు విశ్రాంతి అవసరమని వెల్లడించారు. దీనిబట్టి చూస్తే అతను టీమిండియాతో వన్డే సిరీస్‌ కు దూరం అవనున్నాడు. ఈ సిరీస్ తో పాటు జరగబోయే ఐపీఎల్ మ్యాచ్ లకి గాను కగిసో రబాడ దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మార్చి 29 నుంచి ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు మొదలు కానున్నాయి. ఇందులో కగిసో రబాడ ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ తరఫున ఆడనున్నాడు. తొలి మ్యాచ్‌ని ఢిల్లీ జట్టు మార్చి 30న కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో ఫిరోజ్ షా కోట్ల వేదికగా ఆడనుంది. ఇందులో ఫిట్ నేస సాధిస్తేనే కగిసో రబాడ తుది జట్టులోకి ఎంపిక కానున్నాడు.

మార్చి 12 నుంచి భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య జరిగే మూడు వన్డేల సీరిస్ ప్రారంభం అవుతుంది. మొదటి వన్డే హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో జరుగుతుంది. ఇక రెండో వన్డే మార్చ్ 15 న లక్నోలో జరుగుతుంది. ఇక చివరి వన్డే మార్చ్ 18 న ఈడెన్ గార్డెన్ లో జరుగుతుంది. ఈ మ్యాచ్ లు అన్ని భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 01:30 PM కి మొదలవుతాయి.

ఇక ప్రస్తుతం భారత్ జట్టు న్యూజిలాండ్ పర్యటనలో ఉంది. ఆ జట్టుతో ఇప్పటికే జరిగిన అయిదు టీ20 మ్యాచ్ లో భారత్ కివీస్ జట్టును క్లీన్ స్వీప్ చేయగా, మూడు వన్డేల సీరీస్ లో భారత్ ని కివీస్ జట్టు క్లీన్ స్వీప్ చేసింది. రెండు టెస్ట్ మ్యాచ్ ల సీరీస్ లో కివీస్ 1-0 తో ఆధిక్యంలో ఉంది. రెండో టెస్ట్ ఈ రోజు (శనివారం) మొదలైంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories