బెయిర్‌స్టో సెంచరీ.. భారీ స్కోరు దిశగా ఇంగ్లాండ్

బెయిర్‌స్టో సెంచరీ.. భారీ స్కోరు దిశగా ఇంగ్లాండ్
x
Highlights

బెయిర్‌స్టో అద్భుత సెంచరీ సాధించాడు. భారత బౌలర్లపై ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ పూర్తి ఆధిపత్యం చలాయిస్తున్నారు. బౌలర్లను విసిగిస్తూ భారీ స్కోరు వైపు...

బెయిర్‌స్టో అద్భుత సెంచరీ సాధించాడు. భారత బౌలర్లపై ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్ పూర్తి ఆధిపత్యం చలాయిస్తున్నారు. బౌలర్లను విసిగిస్తూ భారీ స్కోరు వైపు పరుగులు తీస్తున్నారు. ఓపెనర్ బెయిర్‌స్టో తన సెంచరీని పూర్తిచేసుకున్నాడు. రాయ్ అవుటయ్యకా క్రీజులోకి వచ్చిన రూట్ కూడా బ్యాట్ ఝులిపిస్తున్నాడు. దీంతో 30 ఓవర్లకు ఇంగ్లాండ్ జట్టు 202 పరుగులు సాధించి భారీ స్కోరు దిశగా వేగంగా సాగుతోంది. మరోవైపు వికెట్ల కోసం భారత జట్టు బౌలర్లను మార్చినప్పటికీ ఫలితం కనిపించడం లేదు. ఇదే వరుస కొనసాగితే.. ఇంగ్లాండ్ 400 పరుగులు చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories