Top
logo

ఆ జెర్సీకి కూడా రిటైర్మెంట్‌ ఇవ్వాలి: గంభీర్‌

ఆ జెర్సీకి కూడా రిటైర్మెంట్‌ ఇవ్వాలి: గంభీర్‌
Highlights

భారత క్రికెటర్‌, సిక్సర్ల వీరుడు యువరాజ్‌సింగ్‌ ఇంటర్నేషనల్ క్రికెట్ కి సోమవారం వీడ్కోలు పలికిన సంగతి...

భారత క్రికెటర్‌, సిక్సర్ల వీరుడు యువరాజ్‌సింగ్‌ ఇంటర్నేషనల్ క్రికెట్ కి సోమవారం వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. కాగా అతని వీడ్కోలుపై టీం ఇండియా మాజీ క్రికెటర్, ప్రస్తుత బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ స్పందించారు. యూవీపై ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ ట్వీట్ చేశారు.'నీ అద్భుతమైన కెరీర్‌కు శుభాభినందనలు ప్రిన్స్. భారత్‌కు వన్డే క్రికెట్‌లో నువ్వు అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌వి. యువీ సేవలకుగానూ జెర్సీ నెంబర్ 12కి కూడా బీసీసీఐ రిటైర్మెంట్ ప్రకటించాలి. నాకు నీ తరహాలో బ్యాటింగ్ చేయాలని ఉండేది చాంపియన్‌ ' అంటూ ట్వీట్ చేశారు.Next Story