ధోని రీఎంట్రీ పై హింట్ ఇచ్చిన బీసీసీఐ!

ధోని రీఎంట్రీ పై హింట్ ఇచ్చిన బీసీసీఐ!
x
MS Dhoni
Highlights

భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆస్ట్రేలియా గడ్డపై అక్టోబర్ లో జరగబోయే టీ 20 వరల్డ్ కప్ టోర్నీకి జట్టులోకి రానున్నడా అంటే అవుననే అంటోంది బీసీసీఐ.

భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఆస్ట్రేలియా గడ్డపై అక్టోబర్ లో జరగబోయే టీ 20 వరల్డ్ కప్ టోర్నీకి జట్టులోకి రానున్నడా అంటే అవుననే అంటోంది బీసీసీఐ.. సుదీర్ఘ విరామం తర్వాత ధోనీ ఫొటోని బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేస్తూ 'స్మైల్ ఇజ్ ది వే టూ బీ' అని క్యాప్షన్ ఇచ్చింది.

గతేడాది జరిగిన ఉండే వన్డే ప్రపంచకప్ లో న్యూజిలాండ్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ తర్వాత ధోని మళ్లీ జట్టులోకి వచ్చింది లేదు అయితే ఏడాది ఐపీఎల్ సీజన్ 13తర్వాత ధోని ఫామ్ ఆధారంగా మళ్లీ జట్టులోకి తీసుకోవాలని సెలక్టర్లు ముందుగా భావించారు కానీ ఈ ఏడాది ఐపీఎల్ వాయిదా పడడంతో సెలెక్టర్లు తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్లుగా తెలుస్తోంది..

ఇక ధోనీ కూడా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో సత్తా చాటి తిరిగి జట్టులోకి రావాలని భావించాడు. అందులో భాగంగా గానే చెన్నైలోని చేపాక్ స్టేడియంలో బాగానే ప్రాక్టీస్ చేశాడు. కానీ ఏప్రిల్ 15 వరకు ఐపీఎల్ వాయిదా వేయడంతో తిరిగి రాంచీకి వెళ్ళిపోయాడు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఐపీఎల్ మళ్లీ అదే మొదలవుతుందా అంటే లేదనే సమాధానం వినిపిస్తోంది. దీనితో ధోని ఎంట్రీ కష్టమేమో అని అతని అభిమానులు అనుకున్నారు. కానీ బీసీసీఐ ఇచ్చిన హింటుతో ఖుషి అవుతున్నారు.

ఇక ఈ ఏడాది ఐపీఎల్ రద్దయితే ధోనీ బాగానే నష్టపోతాడు. 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత భారత్ జట్టుకి దూరంగా ఉన్న ధోనీ.. బీసీసీఐ వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్‌ని కూడా ఇప్పటికే చేజార్చుకున్నాడు. ఈ నేపథ్యంలో రిటైర్మెంట్ ప్రకటించాలని ధోని భావిస్తున్నాడు. అందుకు అక్టోబర్ లో జరగబోయే టి20 వరల్డ్ కప్ నే వేదికగా ఎంచుకున్నాడు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories