ఇండియన్ క్రికెట్ టీం కి కొత్త కోచ్ : బీసీసీఐ ముచ్చటగా మూడు షరతులు ..

ఇండియన్ క్రికెట్ టీం కి కొత్త కోచ్ : బీసీసీఐ ముచ్చటగా మూడు షరతులు ..
x
Highlights

ఇండియన్ క్రికెట్ టీంకి కొత్త కోచ్ కావాలని బీసీసీఐ ఓ ప్రకటనను విడుదల చేసింది . దీనికి గాను ఈ నెల 30 సాయింత్రం ఐదు గంటల లోపు దరఖాస్తులు పంపించాల్సి...

ఇండియన్ క్రికెట్ టీంకి కొత్త కోచ్ కావాలని బీసీసీఐ ఓ ప్రకటనను విడుదల చేసింది . దీనికి గాను ఈ నెల 30 సాయింత్రం ఐదు గంటల లోపు దరఖాస్తులు పంపించాల్సి ఉంటుంది .హెడ్ కోచ్ కి దరఖాస్తు చేసే వ్యక్తికీ బీసీసీఐ ముచ్చటగా మూడు షరతులను విధించింది .

1. ఏదైనా టెస్టు జట్టుకు రెండేళ్ళు లేదా అసోసియేట్ జట్టుకు /ఎ/ఐపీఎల్ జట్టుకు కనీసం మూడేళ్ళు చేసిన అనుభవం ..

2. అలాగే తానూ అంతర్జాతీయ స్థాయిలో 30 టెస్టులు లేదా 50 వన్డేలు ఆడిన అనుభవం ఉండాలి .

3. వయసు 60 సంవత్సరాలు మించి ఉండకూడదు ..

ఇక సహాయ కోచ్ లుగా వ్యవహరించే వారికీ కనీసం 10 టెస్టులు లేదా 25 వన్డేలు ఆడిన అనుభవం అయిన ఉండి తీరాలి . హెడ్ కోచ్ రవిశాస్త్రితో పాటు పని చేసిన సహాయ కోచ్ లు కూడా దీనికి అర్హులే ..నిజానికి ప్రపంచ కప్ తోనే వీరి కాంట్రాక్టు అయిపొయింది. కానీ వెస్టిండిస్ టూర్ వచ్చే నెల మూడుతోనే మొదలు కావడంతో మరో 45 రోజులు వీరి కాంట్రాక్టుని పెంచింది బీసీసీఐ ...

Show Full Article
Print Article
More On
Next Story
More Stories